Gulabeela Jendalamma Song: హరీశ్‌రావు నోట రామక్క పాట.. కాంగ్రెసోళ్లు నకలు కొట్టారంటూ సెటైర్లు.. తమ పార్టీ కోసం రూపొందించిన గులాబీల జెండలే రామక్క సాంగ్ సూపర్ హిట్ అయ్యిందని మంత్రి హరీశ్ రావు అన్నారు. దీంతో ఈ పాటను కాంగ్రెసోళ్లు కాపీ కొట్టారంటూ సెటైర్లు వేశారు. కాంగ్రెస్ వాళ్ల దగ్గర అసలు ఉండదని.. అంతా నకిలీనే అంటూ హుస్నాబాద్ ప్రచారంలో నవ్వులు పూయించారు. By Nikhil 22 Nov 2023 in రాజకీయాలు తెలంగాణ New Update షేర్ చేయండి తెలంగాణ ఎన్నికల్లో (Telangana Elections 2023) ఈ సారి రామక్క పాట స్పెషల్ అట్రాక్షన్. గులాబీల జెండలమ్మ (Gulabeela Jendalamma) అంటూ.. స్టార్ట్ అయ్యే ఈ పాట టీఆర్ఎస్ కార్యకర్తలను ఉర్రూతలూగించింది. సెలబ్రేటీలు కూడా ఈ పాటకు రీల్స్ చేయడంతో మరింత వైరల్ గా మారింది. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఈ పాటే ఇంకా వినిపిస్తోంది. ఈ పాట పాడిన కళాకారుల బృందానికి కూడా మంచి పేరు వచ్చింది. ఎన్నికలు హడావుడి ప్రారంభమైన సమయంలో ఆ మ్యూజిక్ వినపడితే చాలు టీఆర్ఎస్ ప్రచారం అన్న భావన అందరిలో వ్యక్తం అయ్యే పరిస్థితి ఉండేది. అయితే.. బీట్ బాగుండడం, ప్రజలకు కనెక్ట్ అయ్యేలా ట్యూన్ ఉండడంతో అన్ని పార్టీలు ఆ పాటను కాపీ కొట్టేశాయి. ఇది కూడా చదవండి: Revanth Reddy: కేసీఆర్ కు రేవంత్ రెడ్డి సంచలన సవాల్! అన్ని పార్టీల అభ్యర్థులు వారి పేరు, వివరాలు ఉండేలా ఈ పాటను మార్చి రికార్డింగ్ చేయించుకుని వాడుకుకంటున్నారు. దీంతో ఇప్పుడు ఈ పాటకు సంబంధించిన మ్యూజిక్ అన్ని పార్టీల ప్రచారంలోనూ వినిపిస్తోంది. దీంతో ఏ పార్టీ వారి పాటో అర్థం కానీ పరిస్థితి ప్రజలకు ఏర్పడింది. ఈ అంశంపై బీఆర్ఎస్ కీలక నేత, ఆర్థిక మంత్రి హరీశ్ రావు (Harish Rao) నిన్న హుస్నాబాద్ ఎన్నికల ప్రచారంలో తనదైన శైలిలో స్పందించారు. మన రామక్క పాటను కూడా కాంగ్రెసోళ్లు కాపీ కొట్టేశారు అంటూ సెటైర్లు వేశారు. 😄 @BRSHarish on congress copying @BRSparty Ramakka song pic.twitter.com/6oLKgohMZc — Nitin (@nitinkcr) November 21, 2023 ఆ పాట సూపర్ ఉందని.. ఊపుడు ఊపుతోందన్నారు. దీంతో ఈ పాటకు కొట్టుకుపోతామని కాంగ్రెస్ నేతలు భయపడ్డారని సెటైర్లు వేశారు. దీంతో దాన్ని నకలు కొట్టారని నవ్వులు పూయించారు. కాంగ్రెస్ వాళ్లది అసలు ఏదీ ఉండదని.. అంతా డుబ్లికేటేనంటూ పంచ్ లు విసిరారు. #brs #telangana-elections-2023 #harish-rao మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి