బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల మధ్య ఘర్షణ.. నేడు మంథని బంద్!

మంథని నియోజకవర్గంలో రాజకీయ వేడి రగులుతోంది. బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల మధ్య ఘర్షణ తార స్థాయికి చేరుకుంది. తమ కార్యకర్తపై దాడి జరగడంతో ఈరోజు మంథని నియోజకవర్గంలో బంద్ కు పిలుపునిచ్చింది కాంగ్రెస్.

New Update
బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల మధ్య ఘర్షణ.. నేడు మంథని బంద్!

Telangana Elections 2023: పెద్దపల్లి జిల్లా మంథనిలో రాజకీయాలువేడెక్కాయి. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ (Congress), బీఆర్ఎస్ (BRS) నేతలు తమ పార్టీల తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇరు పార్టీల నేతలు నిన్నటి సాయంకాలం ప్రచార రథలపై డీజే సౌండ్ బాక్స్ లు పెట్టి మంథని అంబేద్కర్ చౌరస్తాలో ఫోటో పోటీగా ఎక్కువ మోతాదులో సౌండ్ పెట్టడంతో చిన్న గొడవ మొదలుకావడంతో కాంగ్రెస్, బీఆర్ఎస్ కు చెందిన కార్యకర్తలు పెద్ద సంఖ్యలో అంబేద్కర్ చౌరస్తా కు చేరుకొని బహాబాహీ గా సుమారు గంటపాటు ఘర్షణకు దారి తీసింది.

ALSO READ: జగన్ బెయిల్ రద్దు చేయాలని పిటిషన్.. ఎల్లుండే సుప్రీంలో విచారణ!

సంఘటన స్థలానికి పోలీసులు చేరుకొని వారిని అక్కడి నుంచి పంపించారు. అది తేరుకొని కొన్ని గంటలకే అర్ధరాత్రి ముత్తారం మండలం సర్పంచ్ బక్కరావు, దంపతులు తమ కారులో ఎన్నికల ప్రచారానికి మాహా ముత్తారం మండలం మీనాజీపేట కు వెళ్ళగా బీఆర్ఎస్ పార్టీకి చెందిన మహ ముత్తారం మండలం మాజీ జడ్పీటీసీ రాజిరెడ్డికి చెందిన అనుచరులు సర్పంచ్ బక్కరావు కుటుంబం పై దాడి చేసి వారి ప్రయాణిస్తున్న కారు ధ్వంసం చేసి వారిపై అత్యాయత్నానికి ప్రయత్నించారు.ఈ దాడిలో ఇరు పార్టీల నేతలకు గాయాలు కాగా మాజీ జడ్పీటీసీని మహాదేవ పూర్ ఆస్పత్రికి తరలించగా, తీవ్ర గాయాలైన బక్కరావు ను వరంగల్ ఆసుపత్రికి తరలించారు.

publive-image గాయాలతో బక్కరావు

అర్ధరాత్రి విషయం తెలిసిన కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున రోడ్డు పై బీఆర్ఎస్ ప్రభుత్వం నశించాలి అంటూ ఈ హత్య యత్నం కుట్ర వెనుక పుట్ట మధు పాత్ర ఉందంటూ నినాదాలు చేస్తూ ధర్నా చేశారు. దీంతో ఈరోజు కాంగ్రెస్ పార్టీ మంథని నియోజక వర్గం బంద్ పిలుపు ఇచ్చారు. ఈ ఘటన తెలిసిన ఎమ్మెల్యే శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. ఇలాంటి గుండా రాజకీయం, హత్య రాజకీయం ఎలక్షన్ ల ముందే చేస్తున్నారంటే, ఎలక్షన్ లు అయిన తర్వాత ఎలా ఉంటుందో అర్థం చేసుకోవాలని ప్రజాస్వామ్యంలో ప్రజల చేత ఏకగ్రీవంగా ఎన్నుకోబడిన సర్పంచ్ ను మావోయిస్టు అని అనడాన్నిఖండిస్తున్నామని అన్నారు.

పుట్ట మధు మాట్లాడుతూ.. ఎమ్మెల్యే శ్రీధర్ బాబు ఎన్నికల ప్రచారంలో మాజీ మావోయిస్టులను ప్రచారంలో తిప్పుతూ మా పై దాడి చేయడానికి తింపుతున్నారని ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ, ఎన్నికల రిటైరింగ్ అధికారికి ఫిర్యాదు చేసుకుంటూ మంథనిలో రాజకీయ వేడి పుట్టిస్తున్నారు.

ALSO READ: పాల ప్యాకెట్లపై GST

Advertisment
తాజా కథనాలు