TS Elections 2023: మొదలైన మాక్ పోలింగ్.. తెలంగాణ ఎన్నికల లెక్కలివే!

నేడు జరగనున్న తెలంగాణ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. ఇప్పటికే మాక్ పోలింగ్ ప్రారంభమైంది. మొత్తం 119 నియోజకవర్గాలకు గానూ వివిధ పార్టీలు, ఇండిపెండెంట్ అభ్యర్థులు కలిపి 2, 290 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. మొత్తం 3.26 కోట్ల మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.

New Update
TS Elections 2023: మొదలైన మాక్ పోలింగ్.. తెలంగాణ ఎన్నికల లెక్కలివే!

తెలంగాణ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. ఇప్పటికే మాక్ పోలింగ్ ప్రారంభించారు అధికారులు. మొత్తం 3,26,18,205 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. 119 నియోజకవర్గాలకు గాను 2,290 మంది అభ్యర్థులు ఈ ఎన్నికల్లో బరిలో ఉన్నారు. దీంతో అందుకు అనుగుణంగా కట్టుదిట్టమైన ఏర్పాట్లను చేసింది ఈసీ. జిల్లాల వారీగా చూస్తే అత్యధికంగా హైదరాబాద్ జిల్లా పరిధిలో 312 మంది పోటీలో ఉన్నారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 3,504 నామినేషన్లు దాఖలు చేశారు. చివరికి 2,290 మంది బరిలో ఉన్నారు.

జిల్లాల వారీగా అభ్యర్థుల సంఖ్య..
హైదరాబాద్ – 312
రంగారెడ్డి –209
నల్గొండ-144
మేడ్చల్-మల్కాజిగిరి – 126
ఖమ్మం – 119
సంగారెడ్డి –102
భద్రాద్రి కొత్తగూడెం – 95
సిద్దిపేట – 95
సూర్యాపేట –92
నారాయణపేట –77
నిజామాబాద్ – 77
కరీంనగర్ –73
కామారెడ్డి –67
వికారాబాద్ –61
పెద్దపల్లి –61
వరంగల్ – 59
జనగాం – 53
జగిత్యాల – 45
మంచిర్యాల –44
హన్మకొండ – 43
నాగర్ కర్నూల్ – 43
మహబూబ్ నగర్ –42
యాదాద్రి భువనగిరి – 40
నిర్మల్ –38
రాజన్న సిరిసిల్ల –37
ఆదిలాబాద్ – 35
జోగులాంబ గద్వాల – 33
కొమ్రం భీం ఆసిఫాబాద్ – 30
మహబూబాబాద్ – 26
మెదక్ – 24
జయశంకర్ భూపాలపల్లి – 23
వనపర్తి – 13
ములుగు – 11

మరోవైపు  అభ్యర్ధుల భవితవ్యం తేలనుంది. తెలంగాణ అంతటా పోలింగ్ జరగనుంది. ఇప్పటికే పోలింగ్ కోసం అన్ని పోలింగ్ కేంద్రాలలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రతి నియోజకవర్గంలో అవసరమైన బ్యాలెట్ యూనిట్లను సిద్ధం చేసినట్లు తెలంగాణ చీఫ్ ఎలక్టోరల్ అ‌‍ధికారి వికాస్ రాజ్ మీడియాకు చెప్పారు. సగటున ఒక్కో పోలింగ్ కేంద్రంలో 897 మంది ఓటర్లు ఉన్నారు. దాదాపు 27,094 మంది పోలింగ్ కేంద్రాలలో వెబ్ క్యాస్టింగ్‌కు ఏర్పాట్లు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 35,655 పోలింగ్ కేంద్రాలు ఉండగా అందులో 59,779 బ్యాలెట్ యూనిట్లు ఉన్నాయి. ఇక ఎక్కువ మంది అభ్యర్ధులు పోటీ చేస్తున్న నియోజకవర్గంగా ఎల్బీనగర్(48) ఉంటే..తక్కువ మంది పోటీ చేస్తున్న నియోజకవర్గాలుగా
నారాయణపేట, బాన్సువాడ (7) ఉన్నాయి.

పది శాతం దాటని మహిళా అ‌‍భ్యర్థులు
అయితే ఇంత మంది అభ్యర్ధులు పోటీ చేస్తున్నా ఇందులో మహిళవాటా మాత్రం చాలా తక్కువ ఉంది. కనీసం పది శాతం కూడా వారి సంఖ్య దాటలేదు. మొత్తం పోటీ చేస్తున్న అభ్యర్థుల్లో 2,067 మంది పురుషులు,  222 మంది మహిళా అ‌భ్యర్థులు పోటీ చేస్తున్నారు. ఇద్దరు థర్డ్ జెండర్లు పోటీలో ఉన్నారు. వరంగల్ ఈస్ట్ నియోజకవర్గం నుంచి బీఎస్పీ తరఫున చిత్ర పుష్పితలయ అనే ట్రాన్స్ జెండర్ పోటీ చేస్తున్నారు. జడ్చర్లలో రాష్ట్ర సామాన్య ప్రజాపార్టీ నుంచి జానకమ్మ పోటీ చేస్తున్నారు. పార్టీల వారీగా చూస్తే బీఆర్ఎస్ 119 స్థానాల్లో పోటీ చేస్తుండగా 8 మంది మహిళలు బరిలో ఉన్నారు. కాంగ్రెస్ 118 స్థానాల్లో పోటీ చేస్తుండగా 12 మంది మహిళలు పోటీ చేస్తున్నారు. బీజేపీ 111 స్థానాల్లో పోటీలో ఉండగా, వారిలో 13 మంది మహి‌‍ళలు ఉన్నారు. మరోవైపు బీజేపీతో పొత్తుతో జనసేన ఈ ఎన్నికల్లో పోటీ చేస్తోంది. జనసేన ఎనిమిది స్థానాల్లో పోటీ చేస్తుండగా, వారిలో ఒక మహి‌ళ ఉన్నారు.

ఈసారి ఎన్నికల్లో అన్నింటికంటే ముఖ్యమైన విషయం ఎక్కువ మంది యువత పోటీలో ఉన్నారు. పోటీలో ఉన్నవారిలో ఎక్కువ మంది 31 నుంచి 40 ఏళ్ళ మధ్య వయసు ఉన్న వారు ఉన్నారు. 25-30 ఏళ్ళ వయసున్న వారు 240 మంది ఉంటే..31-40 ఏళ్ళ వయసున్న వారు 787 ఉన్నారు. ఇక 41-50 ఏళ్ళ వయసున్సన వారు 628 ఉండగా 51-60 ఏళ్ళ వయసున్న వారు 434 మంది ఉన్నారు. ఆ తరువాత 61-70 ఏళ్ళ వయసున్న వారు 171 మంది, 71-80 ఏళ్ళ వయసున్న వారు 29 మంది ఉండగా 81-85 వయసున్న వారు మాత్రం ఒక్కరే ఉన్నారు. 84 ఏళ్ళ వయసులో మల్కాజిగిరి నియోజకవర్గం నుంచి రావికోటి మదన్ మోహన్ స్వతంత్ర అ‌‍భ్యర్థిగా పోటీ చేస్తున్నారు.అలాగే, జగిత్యాల నియోజకవర్గం నుంచి చీటి శ్యామల, వేములవాడ నియోజకవర్గం నుంచి జక్కని భూపతి 80ఏళ్ళ వయసులో పోటీ చేస్తున్నారు.

యువత ఓటింగ్ కీలకం
ఈసారి ఎన్నికల్లో యువత ఓటింగ్ కీలకంగా మారనుంది. యువత, మహిళలు ఎటు వైపు మొగ్గు చూపితే.. ఆ పార్టీకి విజయావకాశాలు ఎక్కువగా ఉంటాయని అంచనాలు చెబుతున్నాయి. రాష్ట్రం మొత్తం ఓటర్లు 3,26,18,205 మంది ఉన్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. వీరిలో 1,63,13,268 మంది పురుషులు కాగా, 1,63,02,261మంది మహిళా ఓటర్లు ఉన్నారు. మరో 2,676 మంది థర్డ్ జెండర్ ఓటర్లు ఉన్నారు. ఇందులో కొత్తగా ఓటు హక్కు దక్కించుకున్న వారు 9,99,667 ఉంటే 80 ఏళ్లు పైబడిన ఓటర్లు 4,40,371 మంది ఉన్నారు. అత్యధిక ఓటర్లున్న నియోజకవర్గం శేరిలింగంపల్లి 7,32,506తో ఉండగా..అత్యల్ప ఓటర్లున్న నియోజకవర్గం భద్రాచలం 1,48,713లో ఉన్నారు.

Advertisment
తాజా కథనాలు