Congress Job Calendar: ఫిబ్రవరి 1న గ్రూప్-1, ఏప్రిల్ లో గ్రూప్-2.. కాంగ్రెస్ సంచలన జాబ్ క్యాలెండర్!

కాంగ్రెస్ పార్టీ ఈ రోజు విడుదల చేసిన ఎన్నికల మేనిఫెస్టోలో భారీగా ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తామని చెప్పడంతో పాటు.. గ్రూప్-1, 2, 3, 4 తో పాటు ఏ ఉద్యోగ నోటిఫికేషన్ ను ఎప్పుడు విడుదల చేస్తామో కూడా చెప్పి నిరుద్యోగులకు ఆకట్టుకునే ప్రయత్నం చేసింది.

Congress Job Calendar: ఫిబ్రవరి 1న గ్రూప్-1, ఏప్రిల్ లో గ్రూప్-2.. కాంగ్రెస్ సంచలన జాబ్ క్యాలెండర్!
New Update

Telangana elections 2023: ప్రభుత్వంపై నిరుద్యోగుల అసంతృప్తిని ఓట్లుగా మలచుకోవడంపై కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా దృష్టిపెట్టింది. టీఎస్పీఎస్సీ పేపర్ల లీకేజీ; గ్రూప్-1, గ్రూప్-2 సహా కమిషన్ నిర్వహించిన అనేక పరీక్షల్లో అవకతవకలు, వరుస వాయిదాల నేపథ్యంలో రాష్ట్రంలో నిరుద్యోగులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. మరోవైపు డీఎస్సీలోనూ తక్కువ ఉద్యోగాలుండడం లక్షలాది మంది అభ్యర్థులను నిరాశపరిచింది. ఈ అంశాలను తమ మేనిఫెస్టోలో చేర్చాలంటూ నిరుద్యోగులు, విద్యార్థుల నుంచి పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వానికి వినతులు వచ్చాయి. వాటిని పరిగణనలోకి తీసుకన్న అధిష్టానం శుక్రవారం విడుదల చేసిన మేనిఫెస్టోలో నిరుద్యోగుల అంశానికి పెద్దపీట వేసింది. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఏ తేదీ రోజు ఏ ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేస్తామో చెప్పి నిరుద్యోగులకు ఆకట్టుకునే ప్రయత్నం చేసింది హస్తం పార్టీ.
ఇది కూడా చదవండి: Congress Manifesto: రైతులకు 2 లక్షలు.. అమ్మాయి పెళ్లికి లక్ష, తులం బంగారం.. కాంగ్రెస్ సంచలన మేనిఫెస్టో

జాబ్ క్యాలెండర్ ప్రకటన:
2024 ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి వివిధ ఉద్యోగాల భర్తీ ప్రక్రియను ప్రారంభిస్తామని మేనిఫెస్టోలో కాంగ్రెస్ ప్రకటించింది. గ్రూప్ -1 ఉద్యోగాల నియామక ప్రక్రియ ప్రారంభంతో ఆ పార్టీ ప్రకటించిన జాబ్ క్యాలెండర్ మొదలైంది. కాగా, గ్రూప్-2, గ్రూప్-3 పరీక్షలను రెండు దశలుగా నిర్వహిస్తామని ప్రకటించింది.
గ్రూప్-2: తొలి దశ - ఏప్రిల్ 1, రెండోదశ- డిసెంబరు 15
గ్రూప్-3: తొలి దశ - జూన్ 1, రెండోదశ- డిసెంబరు 1
గ్రూప్-4: తొలి దశ - జూన్ 1, రెండో దశ- డిసెంబరు 12
ఇది కూడా చదవండి: TS Elections 2023: ఈ 8 స్థానాల్లో అభ్యర్థులు మళ్లీ వారే.. కానీ పార్టీలే మారే!

ఏఈ, పంచాయితీరాజ్, నీటిపారుదల, ప్రజారోగ్యం, హెచ్ఎండబ్ల్యూఎస్ అండ్ ఎస్బీ- కాలుష్య నియంత్రణ మండలి: తొలిదశ- మే 1
వ్యవసాయాధికారులు, ఉద్యాన అధికారులు, పశుసంవర్ధక అధికారులు: తొలి దశ- మే 1
ఏఎంవీఐ, టీపీవో, ఏఈవో, హెచ్ఎండబ్ల్యూఎస్ అసిస్టెంట్ ఆఫీసర్లు, సహాయక హైడ్రాలజిస్ట్, టెక్నికల్ అసిస్టెంట్లు, డ్రగ్ ఇన్స్పెక్టర్, ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్, వెటర్నరీ సహాయకులు, ఫీల్డ్ సూపర్ వైజర్, డిప్యూటీ సర్వేయర్: తొలి దశ - జూన్ 1, రెండో దశ- డిసెంబరు 1

యూనిఫాం సిబ్బంది నియామకం: తొలి దశ - ఏప్రిల్ 1, రెండో దశ - డిసెంబరు 15
ఉపాధ్యాయ నియామక పరీక్ష: తొలి దశ - ఏప్రిల్ 1, రెండో దశ - డిసెంబరు 15
స్టాఫ్ నర్సులు, ఇతర నర్సులు, హాస్పిటల్ సహాయకులు, ఫిజియో థెరపిస్టులు, పారామెడికల్ సహాయకులు: తొలి దశ - మే 1, రెండో దశ - డిసెంబరు 15
డాక్టర్లు - ప్రజారోగ్యం, వైద్య విధాన పరిషత్, మెడికల్ కాలేజీలు: తొలి దశ - ఆగష్టు 1
వీఆర్వో, పంచాయతీ సెక్రటరీ, పంచాయతీ, మండల స్థాయి సాంకేతిక సిబ్బంది: తొలి దశ - జూన్ 1

#revanth-reddy #telangana-elections-2023 #jobs #telangana-congress-manifesto
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe