CM KCR: ఎవ‌డు ఏడ్సినా.. మళ్లీ గెలిచేది మేమే: హుజూరాబాద్ మీటింగ్ లో కేసీఆర్

ఎంతమంది తమ ప్రభుత్వంపై ఏడ్చినా.. మళ్లీ గెలిచేది తామేనని బీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. శుక్రవారం కరీంనగర్, చొప్పదండి, హుజూరాబాద్‌లలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభల్లో కేసీఆర్ పాల్గొన్నారు. , 58 ఏళ్ల పాటు ఏడిపించిన కాంగ్రెస్ ను మరోసారి ఓడించాలన్నారు.

New Update
CM KCR: ఎవ‌డు ఏడ్సినా.. మళ్లీ గెలిచేది మేమే: హుజూరాబాద్ మీటింగ్ లో కేసీఆర్

కాంగ్రెస్ పార్టీ (Congress Party) దోకాబాజ్ పార్టీ అని, ఉన్న తెలంగాణను ఊడగొట్టి, 58 ఏళ్ల పాటు ఏడిపించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ (CM KCR) విమర్శించారు. బీఆర్‌ఎస్‌ (BRS) మళ్లీ అధికారంలోకి రాబోతోందని, ఇందులో సందేహమే లేదని ధీమా వ్యక్తం చేశారు. శుక్రవారం కరీంనగర్, చొప్పదండి, హుజూరాబాద్‌లలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ''ఎవ‌డు ఏది అన్నా.. ఎవ‌డు ఏడ్సినా.. డెఫినెట్‌గా బీఆర్ఎస్ గ‌వ‌ర్న‌మెంటే వ‌స్త‌ది. ఇప్ప‌టికే సగం తెలంగాణ తిరిగాను. అద్భుతంగా ఉంది. మ‌న‌కు ఏం డౌట్ అవ‌స‌రం లేదు. ప్ర‌తిప‌క్షాల‌ను ప‌ట్టించుకోవాల్సిన అవ‌స‌రం లేదు. మ‌నం ప్ర‌జ‌ల‌తో ఉన్నాం.. ప్ర‌జ‌లు మ‌న‌తో ఉన్నారు.. 30న త‌మాషా చూపెడుతారు.. దానికి పైసా మందం కూడా రందీ ప‌డాల్సిన అవ‌స‌రం లేదు'' అని కేసీఆర్ పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: సీనియర్ సిటిజన్స్ కు ఫ్రీగా కాశీ టూర్.. ప్రతీ రైతుకు ఆవు.. బీజేపీ మేనిఫెస్టో ఇదే?

కాంగ్రెసొస్తే మళ్లీ పాత కథే
శుక్రవారం నాడు విడుదలైన కాంగ్రెస్ మేనిఫెస్టోపై ప్రజా ఆశీర్వాద సభలు వేదికగా కేసీఆర్‌ స్పందించారు. ధరణి స్థానంలో భూ భారతి తెస్తామని కాంగ్రెస్ వాళ్లు ఎప్పటి నుండో చెబుతున్నారని, ఇది కొత్తదేమీ కాదన్నారు. భూ భారతిని 30, 40 ఏళ్ల క్రితమే తీసుకువచ్చారని దీంతో ఎమ్మార్వోలు, తహశీల్దార్లు, దళారుల మళ్లీ పాత కథే ఉంటుందని హెచ్చరించారు. ధరణి తీసేస్తే రైతు మళ్లీ లంచాలు పెరుగుతాయన్నారు. ధరణితో ఎవరి భూములపై వారికే అధికారం ఉందని ఆ అధికారం ఉంచుకుంటారో వదులుకుంటారో మీ ఇష్టం అన్నారు. కాంగ్రెస్‌ది ఒక పనికిమాలిన మేనిఫెస్టో అని, వాళ్ల మాటలు నమ్మితే వైకుంఠపాలిలో పెద్ద పాము నోట్లో పడినట్లేనని, కాంగ్రెస్‌ గెలిస్తే తెలంగాణ కథ మళ్లీ మొదటికొస్తదని సీఎం కేసీఆర్‌ విరుచుకుపడ్డారు.

కాంగ్రెస్‌ చాలా డేంజర్‌
రైతులకు 24 గంటల కరెంట్ ఉండాలని చెబుతున్నది బీఆర్ఎస్ పార్టీ అయితే 3 గంటలే చాలు అంటున్నది కాంగ్రెస్ పార్టీ అని, ఏ పార్టీ అధికారంలో ఉండాలో ప్రజలే నిర్ణయించాలన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా రైతుబంధు ఇవ్వలేదు సరికదా మేమిస్తుంటే అది వృథా అని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారని, రైతు బంధు ఇవ్వాలా వద్దా అని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ను నమ్మి కర్నాటక ప్రజలు మోసపోయారని, అక్కడ 5 గంటల కరెంట్ కూడా ఇవ్వని కాంగ్రెస్ నేతలు 24 గంటల కరెంట్ ఇస్తున్న తెలంగాణకు వచ్చి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారని, ప్రజలు ఆలోచన చేయాలన్నారు.

మళ్లీ నన్ను బాధ పెట్టొద్దు
హుజూరాబాద్‌ నియోజకవర్గ పరిధిలోని జమ్మికుంటలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్‌ మాట్లాడుతూ.. ఇక్కడ కౌశిక్‌రెడ్డిని గెలిపించాలని ఓటర్లకు విజ్ణప్తి చేశారు. గతంలో ఓసారి హుజురాబాద్ ప్రజలు తనని బాధ పెట్టారని… ఈసారి అలా జరగొద్దని అన్నారు. ఎన్నికలు వచ్చాయంటే అడ్డగోలు జమాబందీలు జరుగుతుంటాయని.. రాయి ఏదో.. రత్నం ఏదో ప్రజలు ఆలోచించుకోవాలని కేసీఆర్‌ హుజూరాబాద్‌ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. పేదల గురించి ఆలోచించే ఏకైక పార్టీ బీఆర్ఎస్ అన్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు