చేర్యాలలో ఈ రోజు జరిగిన బీఆర్ఎస్ (BRS) ఎన్నికల మీటింగ్ లో పాల్గొన్న బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ (CM KCR) టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై (Revanth Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. నిన్న ఓ పిచ్చికుక్క నిన్న జనగామకు వచ్చి పోయిందంటూ ధ్వజమెత్తారు. నిన్న మొరిగిన ఆ కుక్క రైఫిల్ పట్టుకుని ఎవడ్రా తెలంగాణ ఉద్యమం చేసేదంటూ నాడు కరీంనగర్ పైకి వెళ్లిందంటూ ఫైర్ అయ్యారు. అప్పటి నుంచి ఆయన పేరును ఆ రైఫిల్ రెడ్డిగా పెట్టారన్నారు. ఉద్యమం జరిగిన సమయంలో ఆంధ్రోళ్ల బూట్లు నాక్కుంటూ ఉన్నాడన్నారు.
ఇది కూడా చదవండి: BREAKING: హైదరాబాద్ లో భారీగా నగదు పట్టివేత.. అవన్నీ పొంగులేటి పైసలేనా?
చంద్రబాబునాయుడుకు చెంచాగిరి చేసుకుంటూ ఉన్నాడని సంచలన వ్యాఖ్యలు చేశారు. అలాంటిది.. ఇప్పుడు వచ్చి తెలంగాణ ఉద్యమ కారులను, కేసీఆర్ ను తిట్టడం మర్యాదా? అని ప్రశ్నించారు. ఆయన కేసీఆర్ కు పిండం పెడతా అని అంటాడని.. ఎవరికి పిండం పెట్టాలో ప్రజలే నిర్ణయించాలని కోరారు.
గెలిచే వాళ్లు ఇలాంటి మొరుగుడు చేయరని ధ్వజమెత్తారు. డిపాజిట్లు పోతయన్న భయం ఉన్న వారే ఇలాంటి మొరుగుడు చేస్తారని నిప్పులు చెరిగారు. రేవంత్ రెడ్డిపై సీఎం కేసీఆర్ నేరుగా ఇంతలా అటాక్ చేయడం ఇదే మొదటిసారి. దీంతో ఈ వ్యాఖ్యలకు రేవంత్ రెడ్డి ఎలా కౌంటర్ ఇస్తారన్నది తెలంగాణ రాజకీయవర్గాల్లో ఆసక్తిగా మారింది.