Telangana Politics: బీఆర్ఎస్ కు బిగ్ షాక్.. కాంగ్రెస్ లో చేరిన మాజీ ఎంపీ

ఎన్నికలు దగ్గర పడిన ఈ సమయంలో బీఆర్ఎస్ కు బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీ కీలక నేత, నాగర్ కర్నూల్ మాజీ ఎంపీ మందా జగన్నాథం కాంగ్రెస్ లో చేరారు. అలంపూర్ టికెట్ ను తన కుమారుడికి కేటాయించకపోవడంతో జగన్నాథం బీఆర్ఎస్ పై అసంతృప్తితో ఉన్నారు.

Telangana Politics: బీఆర్ఎస్ కు బిగ్ షాక్.. కాంగ్రెస్ లో చేరిన మాజీ ఎంపీ
New Update

నాగర్ కర్నూల్ మాజీ ఎంపీ మందా జగన్నాథం బీఆర్ఎస్ పార్టీకి (BRS Party) గుడ్ బై చెప్పారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే (Mallikharjun Kharge) సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. మందా జగన్నాథం తెలంగాణ ఉద్యమ సమయంలో కాంగ్రెస్ ను వీడి బీఆర్ఎస్ లో చేరారు. 2014 ఎన్నికల్లో నాగర్ కర్నూల్ ఎంపీగా పోటీ చేసి ఓటమిపాలయ్యారు. అనంతరం 2019 పార్లమెంట్ ఎన్నికల్లో ఆయనకు టికెట్ ఇవ్వలేదు. ఆయన స్థానంలో పోతుగంటి రాములును బరిలోకి దించింది బీఆర్ఎస్. అప్పటి నుంచి ఆయన తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.

ఇది కూడా చదవండి: Telangana Elections: బీఆర్ఎస్ ఇప్పటి వరకు గెలవని 17 స్థానాలివే.. ఈసారైనా బోణీ కొట్టేనా?

అలంపూర్ టికెట్ ను తన కుమారుడికి ఇవ్వాలని ఆయన బీఆర్ఎస్ హైకమాండ్ ను కోరగా నిరాకరించింది. ఈ నేపథ్యంలో ఆయన బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పి కాంగ్రెస్ లో చేరారు. ఇటీవల గద్వాలలో జరిగిన బీఆర్ఎస్ పార్టీ ప్రజా ఆశీర్వాద సభలోనూ మందా జగన్నాథం పాల్గొన్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో నాగర్ కర్నూల్ ఎంపీ టికెట్ ఇచ్చేందుకు కాంగ్రెస్ హైకమాండ్ హామీ ఇచ్చినట్లు ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలోనే ఆయన పార్టీ వీడారని సమాచారం.

ఇది కూడా చదవండి: Congress Manifesto: రైతులకు 2 లక్షలు.. అమ్మాయి పెళ్లికి లక్ష, తులం బంగారం.. కాంగ్రెస్ సంచలన మేనిఫెస్టో

అయితే.. మందా జగన్నాథం రాజకీయ జీవితం తెలుగుదేశం పార్టీతో ప్రారంభమైంది. ఆ పార్టీ నుంచి 1996, 99, 2004 ఎన్నికల్లో నాగర్ కర్నూల్ ఎంపీగా గెలుపొందారు. 2009లో కాంగ్రెస్ నుంచి గెలుపొందారు. కేసీఆర్ దీక్ష తర్వాత టీఆర్ఎస్ లో చేరారు. మందా జగన్నాథం పార్టీ మారడం వెనుక మాజీ ఎంపీ, ఎల్బీ నగర్ కాంగ్రెస్ అభ్యర్థి మధు యాష్కి, అలంపూర్ కాంగ్రెస్ అభ్యర్థి సంపత్ చక్రం తిప్పినట్లు తెలుస్తోంది.

#congress-party #telangana-elections-2023 #brs-party
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe