Barrelakka: బర్రెలక్కకు జాబ్.. దాడి చేసింది వాళ్లే.. బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంచలన ప్రకటన

కొల్లాపూర్ లో బర్రెలక్క పోటీ, ఇటీవల ఆమెపై దాడి తదితర అంశాలపై బీఆర్ఎస్ అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే బీరం హర్షవర్దన్ రెడ్డి స్పందించారు. దాడి చేసింది కాంగ్రెస్ కు చెందిన వారేనని సంచలన ఆరోపణలు చేశారు. ఎన్నికల తర్వాత బర్రెలక్కకు ఉద్యోగం ఇప్పిస్తానని హామీ ఇచ్చారు.

New Update
Barrelakka: బర్రెలక్కకు జాబ్.. దాడి చేసింది వాళ్లే.. బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంచలన ప్రకటన

బర్రెలక్కపై (Barrelakka) దాడి.. ఆమెకు గన్ మెన్ కల్పించాలని హైకోర్టు (AP High Court) తాజా ఆదేశాల నేపథ్యంలో కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్దన్ రెడ్డి స్పందించారు. బర్రెలక్క పై దాడి చేసింది బీఆర్ఎస్ వాళ్లు కాదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ (Congress) వాళ్లే బర్రెలక్కపై దాడి చేశారని ఆరోపించారు. ప్రజాస్వామ్యంలో ఎవరిపైన అయినా పోటీ చేసే హక్కు అందరికీ ఉంటుందన్నారు. బర్రెలక్క పోటీ చేయడం ద్వారా తనకు ఎలాంటి ఇబ్బంది లేదని స్పష్టం చేశారు.
ఇది కూడా చదవండి: Telangana Elections 2023: బీఆర్ఎస్‌కు ఎక్స్‌పైరీ డేట్ అయిపోయింది.. ప్రియాంక గాంధీ సంచలన వ్యాఖ్యలు..

బర్రెలక్కకు సెక్యూరిటీ కల్పించమని తాను కూడా అధికారులు కోరినట్లు చెప్పారు. బర్రెలక్క తరఫున హైకోర్టుకు వెళ్లిన లాయర్ తన స్నేహితుడే అని అన్నారు. హైకోర్టు బర్రెలక్కకు భద్రత కల్పించడం సంతోషకరమన్నారు. కొల్లాపూర్ లో తన గెలుపు పక్కా అని ధీమా వ్యక్తం చేశారు హర్షవర్దన్ రెడ్డి. బర్రెలక్క ఓడిపోతే ఉద్యోగం ఇప్పిస్తానని భరోసానిచ్చారు. ఇదిలా ఉంటే.. తనకు భద్రత కల్పించాలని కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్ గా బరిలోకి దిగిన బర్రెలక్క (శిరీష) హైకోర్టును (Telangana High Court) ఆశ్రయించిన విషయం తెలిసిందే.

ఈ పిటిషన్ పై విచారణ జరిపిన తెలంగాణ హైకోర్టు ఎన్నికలు పూర్తయ్యే వరకు బర్రెలక్కకు (Barrelakka) భద్రత కల్పించాలని పోలీసులను ఆదేశించింది. ఈ సందర్భంగా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. కేవలం గుర్తింపు ఉన్న పార్టీలకే భద్రత ఇస్తే సరిపోదని వ్యాఖ్యానించింది. త్రెట్ ఉందని అభ్యర్థించే అభ్యర్థులందరికీ సెక్యూరిటీ కల్పించాలని స్పష్టం చేసింది.

Advertisment
తాజా కథనాలు