TS BJP Manifesto: ప్రతీ మహిళకు రూ.12 వేలు.. వ్యవసాయ కార్మికులకు రూ.20 వేలు.. బీజేపీ సంచలన మేనిఫెస్టో ఇదే?

బీజేపీ తెలంగాణ ఎన్నికల మేనిఫెస్టోను ఈ నెల 17న విడుదల చేసేందుకు ఆ పార్టీ నేతలు సిద్ధం అవుతున్నారు. వరి క్వింటాకు రూ.3100, మహిళలకు ఏడాదికి రూ.12 వేలు, వ్యవసాయ కార్మికులకు ఏడాదికి రూ.20 వేలు అందించడంతో పాటు పలు కీలక అంశాలు ఇందులో ఉంటాయని నేతలు చెబుతున్నారు.

New Update
TS: కాంగ్రెస్ మేనిఫెస్టో హిందువులకు వ్యతిరేకం.. కిషన్ రెడ్డి

తెలంగాణ ఎన్నికల (Telangana Elections 2023) ప్రచారంలో భాగంగా బీజేపీ అగ్రనేత అమిత్ షా (Amit Shah) ఈనెల 17న రాష్ట్రానికి రానున్నారు. ఆ ఒక్కరోజే 4 మహాసభల్లో ఆయన పాల్గొనున్నారు. నల్లగొండ, వరంగల్, గద్వాల్, రాజేంద్రనగర్ లో నిర్వహించ తలపెట్టిన పబ్లిక్ మీటింగ్స్ లో పాల్గొంటారు. అదే రోజు బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోను సైతం అమిత్ షా విడుదల చేయనున్నారు. సోమాజిగూడలోని బీజేపీ మీడియా సెంటర్ లో మేనిఫెస్టోలను అమిత్ షా విడుదల చేయనున్నారు.

బీజేపీలో ఈ కింది అంశాలు ఉండే అవకాశం ఉందని సమాచారం..

- మోడీ గ్యారంటీ పేరుతో మేనిఫెస్టో

- అందరికీ ఉచిత విద్య, ఉచిత వైద్యం

- ప్రతీ వ్యక్తికి జీవిత భీమా

- ఆయుష్మాన్ భారత్ కింద రూ.10 లక్షల వరకు ఉచిత వైద్యం

- వరి ధర క్వింటాకు రూ.3100

- పెళ్లైన ప్రతీ మహిళకు ఏడాదికి రూ.12 వేలు

ఇది కూడా చదవండి: TS Politics: సొంత గూటికి తుల ఉమ.. మంత్రి కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ లో చేరిక

- సిలిండర్ రూ.500కే

- తెలంగాణలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటు

- రాష్ట్రవ్యాప్తంగా జమ ఔషధీ కేంద్రాలు

- వ్యవసాయ కార్మికులకు ఏడాదికి రూ.20 వేలు

- యూపీఎస్సీ మాదిరిగానే టీఎస్పీఎస్సీ పరీక్షలకు జాబ్ క్యాలెండర్

- రిలీజియస్ టూరిజం పెంపు
ఇది కూడా చదవండి: ఎన్నికల ఎఫెక్ట్.. తెలంగాణకు రాహుల్ గాంధీ.. కీలక ప్రకటన చేయనున్నారా?

- ఐఐటీ, ఎయిమ్స్ తరహాలో విద్యాసంస్థల ఏర్పాటు

- ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద అర్హులైన ప్రతి పేద వ్యక్తికి ఇల్లు

- పథకాన్ని రజక, నాయిబ్రాహ్మనులు, వడ్రంగి, విశ్వబ్రాహ్మణులు, చేతివృత్తులు, చిరువ్యాపారులకు వర్తింపు

- ఫీజుల నియంత్రణ కు చర్యలు

- మహిళ సంఘాలకు, రైతులకు వడ్డీలేని రుణాలు

Advertisment
తాజా కథనాలు