Telangana Elections: తెలంగాణలో కాంగ్రెస్ కు 60 సీట్లు దాటిన చరిత్ర లేదు.. బీజేపీ గ్రాఫ్ పెరిగిందన్న లక్ష్మణ్

తెలంగాణలో బీజేపీ గ్రాఫ్ పెరుగుతోందని ఎంపీ లక్ష్మణ్ అన్నారు. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న సమయం నుంచి ఇప్పటి వరకు తెలంగాణలో 60 సీట్లను కాంగ్రెస్ ఏనాడు గెలవలేదని గుర్తు చేశారు. ఎన్నికల తర కారు షెడ్డుకు వెళ్తుందని.. చేయి గుర్తు పార్టీకి మొండి చేయి గ్యారెంటీ అని జోస్యం చెప్పారు.

New Update
Telangana Elections: తెలంగాణలో కాంగ్రెస్ కు 60 సీట్లు దాటిన చరిత్ర లేదు.. బీజేపీ గ్రాఫ్ పెరిగిందన్న లక్ష్మణ్

తెలంగాణలో ఏనాడూ కాంగ్రెస్ పార్టీకి (Congress Party) 60 సీట్లు రాలేదని రాజ్యసభ ఎంపీ లక్ష్మణ్ (BJP MP K Laxman) అన్నారు. ఆంధ్ర, రాయలసీమలో వచ్చే మెజార్టీ సీట్లతోనే ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు. మోదీ మూడు రోజుల పర్యటనతో తెలంగాణ కేడర్ లో జోష్ నింపిందన్నారు. బీజేపీది ప్రజల మేనిఫెస్టో అని అన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ బూటకపు హామీలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు.
ఇది కూడా చదవండి: Telangana Elections: ముస్లీంల కోసం కాంగ్రెస్ ఏమీ చేయలేదు.. మంత్రి మహమూద్‌ అలీ సంచలన వ్యాఖ్యలు..

ఆచరణకు అమలయ్యే హామీలను మాత్రమే బీజేపీ ఇచ్చిందన్నారు. తెచ్చుకున్న తెలంగాణ అధోగతి పాలు కావొదన్నారు. లక్షల కోట్ల రూపాయలతో ప్రకటనలు ఇచ్చి తెలంగాణ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని కాంగ్రెస్ పై ధ్వజమెత్తారు.

కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణలో ఇచ్చే ప్రకటనలను ఈసీ ఆపివేయడం హర్షించదగిన పరిణామమన్నారు. బీసీలు, మాదిగలు బీజేపీ వైపే ఉన్నారని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో బీజేపీ గ్రాఫ్ పెరిగిందన్నారు. కారు షెడ్డుకు వెళ్ళడం ఖాయమన్నారు. చేయి గుర్తు పార్టీకి మొండి చేయి గ్యారెంటీ అని జోస్యం చెప్పారు.

Advertisment
తాజా కథనాలు