రేవంత్ రెడ్డి పాటకు బండ్ల గణేష్ మాస్ డ్యాన్స్.. వీడియో వైరల్!

కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు ప్రొడ్యూసర్ బండ్ల గణేష్. ప్రచారంలో భాగంగా రేవంత్ రెడ్డి పాటకు స్టెప్పులేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

రేవంత్ రెడ్డి పాటకు బండ్ల గణేష్ మాస్ డ్యాన్స్.. వీడియో వైరల్!
New Update

Telangana Elections 2023: తెలంగాణలో ఎన్నికల ప్రచారానికి తెర పడింది. గత 20 రోజులుగా రాజకీయ నేతల పాటలు, మాటలు, చిందుతలతో ప్రచారాన్ని హోరెత్తించారు. ఎన్నికలు రావడం ఏమో కానీ తెలంగాణ ప్రజలకు మాత్రం మంచి వినోదాన్ని అందించాయి. ఎన్నికల ప్రచారానికి సమయం ముగిసిపోవడంతో పల్లెలు, పట్నాలు మూగబోయాయి.

ALSO READ: ఓటు వెయ్యకపోతే సచ్చిపోతా.. కౌశిక్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు

ఇదిలా ఉండగా ప్రముఖ ప్రొడ్యూసర్, తరుచు వార్తల్లో నిలిచి ప్రజల మనస్సులో నిద్రించే బండ్ల గణేష్ (Bandla Ganesh) పేరు లేకుండా ఎన్నికల ప్రచారాలు ఎలా జరుగుతాయి?. తాజాగా బండ్ల గణేష్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ప్రచారంలో టీపీసీసీ ఛీఫ్ రేవంత్ రెడ్డి పాటకు (Revanth Reddy Songs) తనదైన శైలిలో మాస్ డ్యాన్స్ చేసి కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సహాన్నినింపారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయాన్ని ఎవరు ఆపలేరని ధీమా వ్యక్తం చేశారు.

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది.. ఆరు గ్యారెంటీలను అమలు చేసి తీరుతుందని తేల్చి చెప్పారు. ఇటీవల ప్రముఖ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది.. డిసెంబర్ 9న కాంగ్రెస్ అభ్యర్థి సీఎంగా ప్రమాణస్వీకారం చేస్తారు.. తాను డిసెంబర్ 7 నుంచే ఎల్బీ స్టేడియంలో పడుకుంటాను అని చేసిన వ్యాఖ్యలు ఎంత వైరల్ అయ్యాయో మనకి తెలిసిన విషయమే.

ALSO READ: తెలంగాణ ఎన్నికలు.. భారీగా మద్యం పట్టివేత!

#bandla-ganesh #telangana-elections-2023 #telugu-latest-news #revanth-reddy-songs
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe