అందోలు నియోజకవర్గ ప్రజలు తనకు జిందాబాద్ అంటున్నారని బీజేపీ అభ్యర్థి బాబుమోహన్ (Babu Mohan) అన్నారు. నియోజకవర్గంలో ఎక్కడ చూసినా తాను చేసిన అభివృద్ధే కనిపిస్తోందన్నారు. ఆర్టీవీకి ఆయన ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా బాబుమోహన్ మాట్లాడుతూ.. తన మేనిఫెస్టోలో ప్రజలు సంతోషించే ఎన్నో వరాలు ఉన్నాయన్నారు. తన కుమారుడు బీజేపీని (BJP) వీడడం వల్ల తనకు వచ్చే నష్టం లేదన్నారు. ఎవరు ఎందుకు పార్టీని వీడారో తనకు తెలియదన్నారు. ప్రచారంలో ఉన్న సమయంలోనే తనకు తన కుమారుడు పార్టీని వీడిన విషయం తెలిసిందన్నారు. ఫోన్ చేస్తే ఎత్తడం లేదన్నారు. కోడలికి ఫోన్ చేస్తే ఏడుస్తూ తనకు తెలియదని చెప్పిందన్నారు.
ఇది కూడా చదవండి: Telangana Elections: కాంగ్రెస్ నేత వివేక్ ఇంట్లో ఐటీ అధికారులు సోదాలు..
నియోజకవర్గంలో పది మండలాలను కవర్ చేస్తూ రింగ్ రోడ్ వేశానన్నారు. రోడ్డు లేని గ్రామం కనపడకూడదన్న లక్ష్యంతో అభివృద్ధి చేశానన్నాను. మిషన్ భగీరథ పథకం కన్నా ముందే నియోజకవర్గ ప్రజలకు సింగూరు ద్వారా తాగు నీరు ఇచ్చిన చరిత్ర తనదని గుర్తు చేశారు. తాను ఎమ్మెల్యేగా రూపాయి కూడా సంపాధించలేదన్నారు. ప్రజల కోసమే పని చేశానని చెప్పారు.
ఇది కూడా చదవండి: Revanth Reddy-EC: రేవంత్ రెడ్డి భాష బాగలేదు.. ఈసీకి బీఆర్ఎస్ కంప్లైంట్!
కాంగ్రెస్ అభ్యర్థి లాగా కాంట్రాక్టులు చేసి కోట్లు సంపాధించలేదన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిలాగా చెరువులను అమ్ముకోలేదన్నారు. అందరూ బాబు మోహన్ వెరీ గుడ్ అని అంటున్నారు. అన్న మాట ప్రకారం తనను గెలిపిస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు. తనకు నియోజకవర్గంలో ప్రత్యర్థులు లేరన్నారు. బాబుమోహన్ పూర్తి ఇంటర్వ్యూను కింది వీడియోలో చూడండి..