Telangana Election Counting: కౌంటింగ్ కేంద్రాల వద్ద మూడంచెల భద్రత, 144 సెక్షన్..

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ఆదివారం ఉదయం 8 గంటలకు ప్రారంభం కానుంది. కౌంటింగ్ కేంద్రాల వద్ద మూడంచెల భద్రత ఏర్పాటు చేయడంతో పాటు.. 144 సెక్షన్ విధించారు. కౌంటింగ్ కేంద్రాల పరిసరిల్లో ఎలాంటి ఘటనలు జరుగకుండా పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నారు.

New Update
Telangana Election Counting: కౌంటింగ్ కేంద్రాల వద్ద మూడంచెల భద్రత, 144 సెక్షన్..

144 Section at Counting Centers:తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు డిసెంబర్ 3న జరగనున్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కౌంటింగ్ కేంద్రాలు, పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్ విధించారు పోలీసులు. కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. పోలింగ్(Polling) ముగిసిన వెంటనే ఈవీఎంలను స్ట్రాంగ్ రూమ్‌లకు తరలించారు అధికారులు. ఈ స్ట్రాంగ్‌ రూమ్‌ల వద్ద ఐదంచెల భద్రతను ఏర్పాటు చేశారు. ఆదివారం నాడు ఉదయం 8 గంటల నుంచే కౌంటింగ్ ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈవీఎంలను కౌంటింగ్ కేంద్రాలకు తరలించనున్నారు. కాగా, కౌంటింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి ఘర్షణలు చోటు చేసుకోకుండా ఉండేందుకు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపడుతున్నారు. మూడంచెల సెక్యూరిటీని ఏర్పాటు చేశారు అధికారులు. సెక్యూరిటీలో భాగంగానే పోలింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ను విధించారు. అలాగే పలు చోట్ల ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్, తెలంగాణ స్టే్ట్ స్పెషల్ పోలీస్, సిటీ ఆర్మ్‌డ్ రిజర్వ్, క్విక్ రెస్పాన్స్ టీమ్‌లతో భద్రతను కట్టుదిట్టం చేయనున్నారు.

49 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు..

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 119 నియోజకవర్గాలకు సంబంధించి ఓట్ల లెక్కింపు కోసం 49 కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఉదయం 8 గంటలకే కౌంటింగ్ ప్రారంభం కానుండగా.. మొదట పోస్టల్‌ బ్యాలెట్లను లెక్కించనున్నారు. ఉదయం 8.30 గంటల నుంచి ఈవీఎంలలో ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. ఇక ప్రతి 500 పోస్టల్ బ్యాలెట్లకు ప్రత్యేక టేబుళ్లను ఏర్పాటు చేశారు. ఒక్కో నియోజకవర్గానికి 14 కౌంటింగ్ టేబుల్స్ ఏర్పాటు చేశారు. 6 నియోజకవర్గాల్లో 28 టేబుల్స్‌ ఏర్పాటు చేశారు. కాగా, ఆదివారం ఉదయం 10 గంటల లోపు తొలి ఫలితం వెలువడనుంది. సాయంత్రంలోగా 2,290 మంది అభ్యర్థుల భవితవ్యం తేలనుంది. అయితే, జీహెచ్‌ఎంసీ పరిధిలో చార్మినార్‌కు సంబంధించి తొలి ఫలితం వెలువడనుంది. తుది ఫలితం శేరిలింగం పల్లిది వెలువడనుంది. పోలింగ్ కేంద్రాలు ఎక్కువగా ఉన్న నియోజకవర్గాల్లో ఫలితం ఆలస్యంగా వెలువడే అవకాశం కనిపిస్తోంది. దీని ప్రకారం.. ఎల్బీనగర్, మహేశ్వరం, రాజేంద్రనగర్, మేడ్చల్, కుత్బుల్లాపూర్ నియోజవర్గాల్లో ఫలితాలు ఆలస్యంగా వెలువడనున్నాయి.

Also Read:

మందుబాబులకు షాక్.. తెలంగాణలో రేపు వైన్ షాప్‌లు బంద్..

మరో మూడేళ్లు కేసీఆర్ఏ సీఎం.. ట్విస్ట్ ఇచ్చిన ప్రముఖ జ్యోతిష్యుడు

Advertisment
తాజా కథనాలు