ప్రజా తీర్పును శిరసావహిస్తున్నా.. ఈటల రాజేందర్ ఎమోషనల్!

తన ఓటమిపై స్పందించారు బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఈటల రాజేందర్. ప్రజా తీర్పును శిరసావహిస్తున్నా అని అన్నారు. ఈ ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీకి శుభాకాంక్షలు తెలిపారు.

ప్రజా తీర్పును శిరసావహిస్తున్నా.. ఈటల రాజేందర్ ఎమోషనల్!
New Update

Etela Rajender: తెలంగాణ ఎన్నికల ఫలితాలు బీజేపీకి ఊహించని షాక్ ఇచ్చాయి. గెలుస్తారనుకున్న అభ్యర్థులు ఓటమి పాలయ్యారు. కరీంనగర్ లో బండి సంజయ్, దుబ్బాకలో రఘునందన్ రావు, కోరుట్లలో ధర్మపురి అర్వింద్, గజ్వేల్- హుజురాబాద్ రెండు స్థానాల్లో ఈటల రాజేందర్ తమ ప్రత్యర్థులపై ప్రజలు ఇచ్చిన తీర్పుతో ఓడిపోయారు.

ALSO READ: రేవంత్ రెడ్డిని సీఎం కానిస్తారా!.. నెక్స్ట్ ఆప్షన్స్ ఇవే

తాజాగా తన ఓటమిపై స్పందించారు బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఈటల రాజేందర్. ట్విట్టర్ లో ఆయన.. 'ప్రజా తీర్పును శిరసావహిస్తున్నా, గెలిచినవారికి అభినందనలు. నన్ను ప్రేమించి, దీవించిన ప్రతిఒక్కరికీ ధన్యవాదములు. హుజురాబాద్ ప్రజలు ఇన్నేళ్లుగా వారికి సేవ చేసే భాగ్యాన్ని కలిగించారు. వారి రుణం తీర్చుకోలేనిది. ఫలితాన్ని జీర్ణించుకోలేక పోతున్న కార్యకర్తలు, అభిమానులు ప్రతిఒక్కరికీ నా వినమ్ర విజ్ఞప్తి ఎవరూ ఆవేదన చెందవద్దు. ప్రజల తీర్పును గౌరవిద్దాం.

గజ్వేల్ లో అతితక్కువ కాలమే అయినా ఆదరించి, ఆశీర్వదించి ఓట్లు వేసిన ప్రజలకు పనిచేసిన కార్యకర్తలు, నాయకులు ప్రతిఒక్కరికీ కృతజ్ఞతలు. గెలుపొందిన బిజెపి అభ్యర్థులకు హార్దిక శుభాకాంక్షలు. ప్రజల సమస్యలను అసెంబ్లీ సాక్షిగా వినిపించాలని కోరుకుంటున్నాను. అధికారం చేపట్టబోతున్న కాంగ్రెస్ పార్టీకి శుభాకాంక్షలు. ఈ ఎన్నికలలో రాష్ట్రవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ గెలుపుకోసం అహర్నిశలు కృషి చేసిన నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు మరియు ప్రజలందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు. జై తెలంగాణ !! భారత్ మాతాకీ జై !!' అంటూ రాసుకొచ్చారు.

ALSO READ: ఆ నియోజకవర్గంలో కౌంటింగ్‌కు బ్రేక్..

#telangana-election-2023 #telangana-elections-results #bjp-etela-rajender-lost
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe