మరికొన్ని గంటల్లో తెలంగాణ ఎన్నికల (Telangana Elections 2023) కౌంటింగ్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ కీలక నేత, కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ (DK Shiva Kumar) చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. తమ అభ్యర్థులతో సీఎం కేసీఆర్ స్వయంగా మాట్లాడుతున్నారని ఆయన చెప్పడం హాట్ టాపిక్ గా మారింది. కేసీఆర్ నేరు తమ అభ్యర్థులతో మాట్లాడినట్లు చెప్పారు. ఈ విషయాన్ని తమ అభ్యర్థులే తెలిపారన్నారు. అయితే.. తమ అభ్యర్థులు ఎవరూ బయటకు వెళ్లరన్నారు. ఇదిలా ఉంటే.. రేపు ఫలితాలు విడుదల కానున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అలర్ట్ అయ్యింది.
ఇది కూడా చదవండి: TS Elections 2023: అలా జరిగితే మేమే కింగ్.. కాంగ్రెస్, బీఆర్ఎస్ ను టెన్షన్ పెడుతున్న బీజేపీ లెక్కలివే!
డీకే శివకుమార్ ను ఆ పార్టీ హైకమాండ్ రంగంలోకి దించింది. రేపు రిజల్ట్స్ వచ్చిన వెంటనే అభ్యర్థులను క్యాంప్ కు తరలించాలని ఆ పార్టీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఏర్పాట్లు సైతం సాగుతున్నాయి. ఇదిలా ఉంటే.. ఎమ్మెల్యే క్వార్టర్ట్స్ లో ఠాక్రే రాష్ట్ర కాంగ్రెస్ నేతలతో భేటీ అయ్యారు. ఈ భేటీకి రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్క తదితరులు హాజరైనట్లు తెలుస్తోంది. కౌంటింగ్ సమయంలో ఎలా అప్రమత్తంగా ఉండాలి అన్న అంశంపై వీరి భేటీలో చర్చ జరుగుతోంది.
ఇది కూడా చదవండి: AP Barrelakka: ఏపీలో మరో బర్రెలక్క.. ఏకంగా ఎమ్మెల్యే కేతిరెడ్డిపైనే పోటీకి సై.. వైరల్ వీడియో!
మరో వైపు బీఆర్ఎస్ నేతలు సైతం గెలుపుపై ధీమాగా ఉన్నారు. సీఎం కేసీఆర్ ఓ అడుగు ముందుకేసి ఈ నెల 4న కేబినెట్ మీటింగ్ నిర్వహించనున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు సీఎంఓ నుంచి ప్రకటన విడుదలైంది. ఫలితాలు తప్పకుండా తమకు అనుకూలంగానే ఉంటాయని.. టెన్షన్ పడాల్సిన అవసరం లేదని తనను కలిసిన నేతలతో కేసీఆర్ చెబుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. కేటీఆర్ కూడా ఇదే ధీమాను వ్యక్తం చేస్తున్నారు.