Telangana Polling: తెలంగాణ వ్యాప్తంగా ఏ జిల్లాలో ఎంత పోలింగ్ నమోదు అయ్యిందంటే..!

తెలంగాణ వ్యాప్తంగా పోలింగ్ జోరుగా సాగుతోంది. సాయంత్రం 4 గంటల వరకు 62 శాతానికి పైగా పోలింగ్ నమోదైంది. జిల్లాల్లో అత్యధికంగా మెదక్‌లో 70 శాతం, అత్యల్పంగా హైదరాబాద్‌లో 32 శాతం పోలింగ్ నమోదైంది.

New Update
General Elections 2024: లోక్‌సభ నాలుగో దశ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా పెరిగిన పోలింగ్ శాతం 

Telangana Polling Percentage: తెలంగాణలో ఎన్నికల పోలింగ్ జోరుగా సాగుతోంది. ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు పోటెత్తారు. దాంతో రాష్ట్రంలో పోలింగ్ శాతం అమాంతం పెరిగిపోయింది. రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే.. ఇప్పటి వరకు 62 శాతానికి పైగా పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు చెబుతున్నారు. ఇక రాష్ట్రంలో అత్యధికంగా మెదక్‌లో 70 శాతం పోలింగ్ నమోదవగా.. అత్యల్పంగా హైదరాబాద్‌(Hyderabad)లో 32 శాతం పోలింగ్ నమోదైంది. జిల్లాల వ్యాప్తంగా పోలింగ్ పర్సంటేజ్ ఎంత ఉందో ఓసారి చూద్దాం..

ఎన్నికల అధికారులు తెలిపిన వివరాల ప్రకారం..

👉 ఆదిలాబాద్‌లో 62.34 శాతం
👉 భద్రాద్రిలో 58.38 శాతం
👉 హన్మకొండలో 49 శాతం
👉 జగిత్యాలలో 58.64 శాతం
👉 జనగామలో 62.24 శాతం
👉 భూపాలపల్లిలో 64.3 శాతం
👉 గద్వాల్‌లో 64.45 శాతం
👉 కామారెడ్డిలో 59.06 శాతం
👉 కరీంనగర్‌లో 56.04 శాతం
👉 ఖమ్మంలో 63.62 శాతం
👉 ఆసిఫాబాద్‌లో 59.62 శాతం
👉 మహబూబాబాద్‌లో 65.05 శాతం
👉 మహబూబ్‌నగర్‌లో 58.89 శాతం
👉 మంచిర్యాలలో 59.16 శాతం
👉 మేడ్చల్‌లో 38.27 శాతం
👉 ములుగులో 67.84 శాతం
👉 నాగర్‌ కర్నూల్‌లో 57.52 శాతం
👉 నల్గొండలో 59.98 శాతం
👉 నారాయణపేటలో 57.17 శాతం
👉 నిర్మల్‌లో 60.38 శాతం
👉 నిజామాబాద్‌లో 56.05 శాతం
👉 పెద్దపల్లిలో 59.23 శాతం
👉 సిరిసిల్లలో 56.66 శాతం
👉 రంగారెడ్డిలో 42.43 శాతం
👉 సంగారెడ్డిలో 56.23 శాతం
👉 సిద్దిపేటలో 64.91 శాతం
👉 సూర్యాపేటలో 62.07 శాతం
👉 వికారాబాద్‌లో 57.62 శాతం
👉 వనపర్తిలో 60 శాతం
👉 వరంగల్‌లో 52.28 శాతం
👉 యాదాద్రిలో 64 శాతం పోలింగ్‌ నమోదైనట్లు అధికారులు ప్రకటించారు.

Also Read:

మాదే అధికారమంటున్న కేటీఆర్, రాహుల్ గాంధీలు

హైదరాబాద్ ఓటర్ల మొద్దు నిద్ర..ఇప్పటికీ కేవలం 13 శాతమే పోలింగ్!

Advertisment
తాజా కథనాలు