Telangana Polling: తెలంగాణ ఎన్నికలకు సర్వం సిద్ధం.. ఉదయం 7 గంటల నుంచి పోలింగ్..

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కోసం సర్వం సిద్ధం చేశారు అధికారులు. ఎన్నికల అధికారులు, భద్రతా సిబ్బంది పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. గురువారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగనుంది.

New Update
Lok Sabha Elections: ముగిసిన లోక్‌సభ ఐదో దశ ఎన్నికలు.. పోలింగ్ శాతం ఎంతంటే

Telangana Elections Polling: తెలంగాణ ఎన్నికల పోలింగ్ ప్రారంభం కానుంది. ఎన్నికల పోలింగ్‌కు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. పోలింగ్ కేంద్రాలకు అధికారులు చేరుకున్నారు. పోలింగ్ కేంద్రాలు, స్ట్రాంగ్ రూమ్‌లు భద్రతా సిబ్బంది తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. ఇక ఉదయం 5.30 గంటలకే మాక్ పోలింగ్ ప్రారంభం కానుండగా.. 7 గంటల నుంచి పోలింగ్ ప్రారంభిస్తారు అధికారులు.

ఇక రాష్ట్రంలో 13 సమస్యాత్మక నియోజకవర్గాలను గుర్తించారు అధికారులు. సిర్పూర్‌, చెన్నూరు, బెల్లంపల్లి, మంచిర్యాల, ఆసిఫాబాద్‌, మంధని, భూపాలపల్లి, ములుగు, పినపాక, ఇల్లందు, కొత్తగూడెం, అశ్వారావుపేట, భద్రాచలంలో సా.4 గంటల వరకే పోలింగ్‌ నిర్వహించనున్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో భద్రత కట్టుదిట్టం చేశారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో అదనపు బలగాల మోహరించారు. మావోయిస్టు ప్రభావిత కేంద్రాల్లో 600 పోలింగ్‌ కేంద్రాలు ఉన్నాయి. ఎన్నికల భద్రత కోసం 375 కంపెనీల కేంద్ర భద్రతా బలగాలు రాష్ట్రానికి చేరుకున్నాయి. భద్రతా విధుల్లో BSF, CISF, ITBP, NSG, సెంట్రల్‌ రిజర్వ్‌ పోలీస్‌ ఫోర్స్‌, 65 వేల మంది తెలంగాణ పోలీసులు, 18 వేల మంది హోంగార్డులు పని చేయనుననారు.

పాతబస్తీలో పకడ్బందీ ఏర్పాట్లు..

మరికొన్ని గంటల్లో పోలింగ్‌ షురూ కానుండగా.. హైదరాబాద్ పాతబస్తీలో ఎన్నికల ఏర్పాట్లు పూర్తయ్యాయి. పోలింగ్‌ కేంద్రాలకు ఎన్నికల సిబ్బంది చేరుకున్నారు. ఇప్పటికే పోలింగ్‌ సిబ్బందికి ఈవీఎంల డిస్ట్రిబ్యూషన్‌ పూర్తి అయింది. రాత్రి పోలింగ్‌ కేంద్రాల్లోనే ఎన్నికల సిబ్బంది బస చేయనున్నారు. గురువారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 వరకు పోలింగ్‌ జరుగుతుంది. పోలింగ్‌ కేంద్రాల వద్ద పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు అధికారులు.

Also Read:

తెలంగాణలో ముగిసిన ఎన్నికల ప్రచారం.. పోలింగ్‌కు సర్వం సిద్ధం..

ముగిసిన తెలంగాణ ఎన్నికల ప్రచార పర్వం.. ఇప్పటివరకు సర్వేల లెక్కలివే!

Advertisment
తాజా కథనాలు