Breaking : తేలిన లెక్క తెలంగాణ ఎన్నికల బరిలో 2,898 మంది.. కేసీఆర్ పై ఎంత మంది పోటీ అంటే? గజ్వేల్ అసెంబ్లీ స్థానానికి 127మంది అభ్యర్థులు 154 సెట్లు నామినేషన్లు దాఖలు చేశారు. అత్యధికంగా గజ్వేల్ 114 మంది అభ్యర్థులు బరిలో దిగుతుండగా.. అత్యల్పంగా నారాయణపేటలో ఏడుగురు అభ్యర్థులు బరిలో ఉన్నారు. By Bhoomi 14 Nov 2023 in తెలంగాణ టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి తెలంగాణలో నామినేషన్ల పరిశీలన ముగిసింది. స్క్రూట్నీ తర్వాత బరిలో 2,898 మంది అభ్యర్థులు నిలిచారు. అత్యధికంగా గజ్వేల్ 114 మంది అభ్యర్థులు బరిలో దిగుతుండగా.. అత్యల్పంగా నారాయణపేటలో ఏడుగురు అభ్యర్థులు బరిలో ఉన్నారు. గజ్వేల్ అసెంబ్లీ స్థానానికి మొత్తం 127మంది అభ్యర్థులు 154 సెట్ల నామినేషన్లు దాఖలు చేయగా...అందులో 13మంది అభ్యర్థులకు గాను 16 సెట్ల నామినేషన్లను అధికారులు రిజక్ట్ చేశారు. ఈరోజు స్వతంత్ర అభ్యర్థులు 28 మంది నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. ప్రస్తుతానికి గజ్వేల్ అసెంబ్లీ స్థానానికి 86మంది అభ్యర్థులు బరిలో దిగారు. గజ్వేల్ అసెంబ్లీ స్థానానికి బీజేపీ నుంచి ఈటల రాజేందర్ పోటీ చేస్తున్నారు. బీఆర్ఎస్ అభ్యర్థిగా సీఎం కేసీఆర్ పోటీ చేస్తున్నారు. గజ్వేల్ బరిలో సీఎం, ఈటెల రాజేందర్ తోపాటు స్వతంత్ర అభ్యర్థులు కూడా ఉన్నారు. అయితే ప్రజలు ఎవర్ని గెలిపిస్తారన్నది ఇప్పుడు హాట్ టాపిగ్గా మారింది. ఇంతమంది బరిలో దిగుతుండటంతో బీఆర్ఎస్ లో అయోమయ పరిస్థితి మొదలైంది. ఇది కూడా చదవండి: పులివెందుల నియోజకవర్గ ఇంచార్జి బి.టెక్ రవి అరెస్ట్.. #NULL మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి