TS Elections: వివేక్‌ ఇంట్లో సోదాలపై ఈడీ సంచలన ప్రకటన.. లావాదేవీల లెక్కలివే!

చెన్నూరు కాంగ్రెస్ అభ్యర్థి, మాజీ ఎంపీ వివేక్ ఇంట్లో సోదాలపై ఈడీ కీలక ప్రకటన చేసింది. రూ.200 కోట్ల అక్రమ లావాదేవీలు జరిగినిట్లు ఈడీ చెప్పింది. నకిలీ పత్రాలతో ఆస్తులు కొనుగోలు చేసినట్లు గుర్తించారు.

New Update
TS Elections: వివేక్‌ ఇంట్లో సోదాలపై ఈడీ సంచలన ప్రకటన.. లావాదేవీల లెక్కలివే!

తెలంగాణలో ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ ఐటీ,ఈడీ దాడులు కాక రేపుతున్నాయి. నిన్న చెన్నూరు కాంగ్రెస్ అభ్యర్థి వివేక్‌ వెంకటస్వామి, ఆయన అనుచరులకు చెందిన ఇళ్లు, కార్యాలయాలపై ఐటీ దాడులు జరిపిన విషయం తెలిసిందే. నిన్న సాయంత్రం నాటికి ఈ సోదాలు ముగియగా.. వివిక్ అనుచరుల ఇళ్లలో అధికారులు డబ్బులు సీజ్‌ చేశారు. ఆసిఫాబాద్ జిల్లాలో రూ.8 కోట్లు సీజ్ చేసినట్లు తెలుస్తోంది. ఇటీవల చెన్నూరు బీఆర్ఎస్ అభ్యర్థి బాల్క సుమన్ వివేక్ పై ఎన్నికల సంఘం, ఈడీకి ఫిర్యాదు చేశారు. డబ్బు సంచులతో చెన్నూరుకు వస్తున్నారని.. నేతలను కొనుగోలు చేస్తున్నట్లు ఆరోపిస్తూ ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే బాల్క సుమన్ ఫిర్యాదుతో ఐటీ అధికారులు తనిఖీలు చేపట్టారు.


ఇక తాజాగా వివేక్ ఇంట్లో సోదాలపై ఈడీ ట్వీట్ చేసింది. 'ఫెమా, 1999 నిబంధనల ప్రకారం తెలంగాణలోని నాలుగు ప్రదేశాలలో హైదరాబాద్‌లోని డాక్టర్ గడ్డం వివేకానంద్ నివాసాలతో పాటు హైదరాబాద్‌లోని విశాఖ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అండ్‌ విజిలెన్స్ సెక్యూరిటీ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ కార్యాలయ ప్రాంగణాల్లో ఈడీ సోదాలు నిర్వహించింది. హైటెక్ సిటీ, మంచిర్యాలలో ఆయన నివాసం ఉంటున్న తాత్కాలిక స్థలంలో కూడా సోదాలు నిర్వహించారు. సోదాల సమయంలో వివిధ నేరారోపణ పత్రాలు, డిజిటల్ పరికరాలను స్వాధీనం చేసుకున్నారు' అని ట్వీట్ చేసింది. మొత్తంగా రూ.200 కోట్ల అక్రమ లావాదేవీలు జరిగినట్లు ఈడీ చెప్పింది. నకిలీ పత్రాలతో ఆస్తులు కొనుగోలు చేసినట్లు గుర్తించారు. విజిలెన్స్‌ సెక్యూరిటీ పేరుతో ఇప్పటివరకు రూ.20 లక్షలు ట్యాక్స్‌ చెల్లించలేదని సమాచారం. విజిలెన్స్‌ సెక్యూరిటీ పేరుతో భారీ ఎత్తున అక్రమ లావాదేవీలు జరిపినట్లు సమాచారం.

విశాఖ ఇండిస్ట్రీస్‌కు చెందిన ట్రాన్స్‌సెక్షన్స్‌ రూ.100 కోట్లు ఉన్నట్లు ఈడీ తెలిపింది.

CLICK HERE FOR MORE DETAILS ON VIVEK ED RAIDS
Also Read: ఐసీసీ టాప్‌ కిరీటాన్ని కింగ్‌ మళ్లీ అందుకుంటాడా? ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌ విడుదల!

WATCH:

Advertisment
తాజా కథనాలు