Telangana DSC: తెలంగాణలో డీఎస్సీ పరీక్ష వాయిదా పడింది. నవంబర్‌లో రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో డీఎస్సీ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు విద్యాశాఖ ప్రకటించింది. సెప్టెంబర్ నెలలో టీచర్ రిక్రూట్‌మెంట్ కోసం డీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసింది తెలంగాణ విద్యాశాఖ. సెప్టెంబర్ 20వ తేదీ నుంచి అక్టోబర్ 21 వరకు అప్లికేషన్‌కు అవకాశం కల్పించింది ప్రభుత్వం. ఎగ్జామ్స్ నవంబర్ 20 నుంచి 30 మధ్య నిర్వహించేందుకు ఏర్పాట్లు కూడా చేసింది. ఈ మేరకు షెడ్యూల్ కూడా విడుదల చేసింది. అయితే, నవంబర్ 30 తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు ఉన్న నేపథ్యంలో.. ఎగ్జామ్ షెడ్యూల్‌ను వాయిదా వేస్తూ విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. తదుపరి ఎగ్జామ్ తేదీలను త్వరలో ప్రకటిస్తామని విద్యాశాఖ తెలిపింది.
గ్రూప్ -2 ఎగ్జామ్స్ కూడా వాయిదా..
తెలంగాణలో గ్రూప్ 2(TSPSC Group 2) పరీక్ష వాయిదా పడింది. ఈ మేరకు స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రకటన విడుదల చేసింది. వాస్తవానికి నవంబర్ 2, 3వ తేదీల్లో గ్రూప్ 2 పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. కానీ, నవంబర్ నెలలోనే తెలంగాణ ఎన్నికలు ఉండటంతో.. పరీక్షలను వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నారు టీఎస్‌పీఎస్‌సీ అధికారులు. ఇక వాయిదా పడిన పరీక్షలను కొత్త ప్రభుత్వం ఏర్పడిన అనంతరం.. అంటే. జనవరి 6, 7 వ తేదీల్లో నిర్వహించనున్నట్లు ప్రకటనలో పేర్కొంది టీఎస్పీఎస్సీ.