TG DSC Key Released: తెలంగాణ పాఠశాల విద్యాశాఖ డీఎస్సీ పరీక్షల ప్రాథమిక కీ విడుదల చేసింది. స్కూల్ అసిస్టెంట్, లాంగ్వేజ్ పండిట్, సెకెండరీ గ్రేడ్, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టు రెస్పాన్స్ షీట్లను అధికారిక వెబ్‌సైట్ https://tgdsc.aptonline.in/tgdsc/ లో ఉంచింది. కీపై అభ్యంతరాలను ఆగస్టు 20వరకు తెలపాలని సూచించింది.
మొత్తం 11,062 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి జులై 18 నుంచి ఆగస్టు 5వరకు పరీక్షలు జరిగాయి. 2,79,957 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా 2,45,263 (87.61 శాతం) మంది పరీక్షలకు హాజరయ్యారు. అత్యధికంగా సెకండరీ గ్రేడ్ టీచర్ (SGT) పోస్టులకు 92.10 శాతం మంది హాజరయ్యారు. ఎస్జీటీలు 6,508, స్కూల్ అసిస్టెంట్ 2,629, భాషా పండితులు 727, పీఈటీలు 182, ప్రత్యేక కేటగిరీలో స్కూల్ అసిస్టెంట్లు 220, ఎస్జీటీలు 796 పోస్టుల భర్తీకోసం ఈ నోటిఫికేషన్ వెలువడింది.