ఎన్నికలకు ముందు సీపీఎం (CPM) కాంగ్రెస్ పొత్తు కుదిరినట్లే కుదిరి.. మళ్లీ కట్ అయిన విషయం తెలిసిందే. దీంతో సీపీఎం ఒంటరిగా బరిలోకి దిగింది. కాంగ్రెస్-సీపీఐ కలిసి పోటీ చేశారు. సీపీఎం పార్టీ ఏడు సీట్లీలో పోటీ చేయగా.. ఎక్కడ కూడా సత్తా చాట లేకపోయింది. అయితే.. ఎన్నికల్లో విజయం తర్వాత రేవంత్ రెడ్డి మాత్రం సీపీఎంను కూడా కలుపుకుని వెళ్తామని ప్రకటించారు. తాజాగా.. సీఎం రేవంత్ రెడ్డిని (CM Revanth Reddy) సీపీఎం నేతలు సెక్రటేరియట్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు.
ఇది కూడా చదవండి: Revanth-Komatireddy: వేగం ఒకడు-త్యాగం ఒకడు.. రేవంత్ రెడ్డి ఫొటోలతో కోమటిరెడ్డి ఇంట్రెస్టింగ్ ట్వీట్!
రేవంత్ సీఎం అయ్యాక తొలిసారి సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం (Thammineni Veerabhadram) కలిశారు. అయితే.. ఈ సమావేశంలో ఇద్దరి మధ్య శాసనసభ ఎన్నికల అంశం చర్చకు వచ్చింది. లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో వెళ్లే యోచనలో సీపీఎం ఉన్నట్లు అర్థం అవుతోంది.
ఇది కూడా చదవండి: KCR : మేము ఓడింది అందుకే.. 30 యూట్యూబ్ ఛానల్స్ పెడితే.. కేటీఆర్ ఇంట్రెస్టింగ్ ట్వీట్!
కాంగ్రెస్ పార్టీ కూడా వామపక్షాలతో కలిసి లోక్‌సభ ఎన్నికలకు వెళ్లాలని భావిస్తున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే.. ప్రజాసమస్యలపై ప్రభుత్వాన్ని కలిసే విషయంలో అస్సలు వెనకాడొద్దని తమ్మినేనికి రేవంత్ రెడ్డి సూచించినట్లు సమాచారం.