CM Revanth Reddy: రేవంత్ రెడ్డిని కలిసిన సీపీఎం నేతలు.. లోక్‌సభ ఎన్నికలపై వ్యూహం ఇదేనా? ఎన్నికల తర్వాత సీపీఎం నేతలు సీఎం రేవంత్ రెడ్డిని నిన్న మర్యాదపూర్వకంగా కలిశారు. లోక్ సభ ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలన్న ఆలోచనపై వీరి మధ్య చర్చ జరిగినట్లు తెలుస్తోంది. By Nikhil 31 Dec 2023 in రాజకీయాలు తెలంగాణ New Update షేర్ చేయండి ఎన్నికలకు ముందు సీపీఎం (CPM) కాంగ్రెస్ పొత్తు కుదిరినట్లే కుదిరి.. మళ్లీ కట్ అయిన విషయం తెలిసిందే. దీంతో సీపీఎం ఒంటరిగా బరిలోకి దిగింది. కాంగ్రెస్-సీపీఐ కలిసి పోటీ చేశారు. సీపీఎం పార్టీ ఏడు సీట్లీలో పోటీ చేయగా.. ఎక్కడ కూడా సత్తా చాట లేకపోయింది. అయితే.. ఎన్నికల్లో విజయం తర్వాత రేవంత్ రెడ్డి మాత్రం సీపీఎంను కూడా కలుపుకుని వెళ్తామని ప్రకటించారు. తాజాగా.. సీఎం రేవంత్ రెడ్డిని (CM Revanth Reddy) సీపీఎం నేతలు సెక్రటేరియట్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఇది కూడా చదవండి: Revanth-Komatireddy: వేగం ఒకడు-త్యాగం ఒకడు.. రేవంత్ రెడ్డి ఫొటోలతో కోమటిరెడ్డి ఇంట్రెస్టింగ్ ట్వీట్! రేవంత్ సీఎం అయ్యాక తొలిసారి సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం (Thammineni Veerabhadram) కలిశారు. అయితే.. ఈ సమావేశంలో ఇద్దరి మధ్య శాసనసభ ఎన్నికల అంశం చర్చకు వచ్చింది. లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో వెళ్లే యోచనలో సీపీఎం ఉన్నట్లు అర్థం అవుతోంది. ఇది కూడా చదవండి: KCR : మేము ఓడింది అందుకే.. 30 యూట్యూబ్ ఛానల్స్ పెడితే.. కేటీఆర్ ఇంట్రెస్టింగ్ ట్వీట్! కాంగ్రెస్ పార్టీ కూడా వామపక్షాలతో కలిసి లోక్‌సభ ఎన్నికలకు వెళ్లాలని భావిస్తున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే.. ప్రజాసమస్యలపై ప్రభుత్వాన్ని కలిసే విషయంలో అస్సలు వెనకాడొద్దని తమ్మినేనికి రేవంత్ రెడ్డి సూచించినట్లు సమాచారం. #cm-revanth-reddy #cpm #tammineni-veerabharam మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి