Corona: తెలంగాణలో మరో నాలుగు కరోనా కేసులు..

తెలంగాణలో మరో నాలుగు కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో 9 కేసులు గుర్తించడం జరిగింది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని వైద్యాధికారులను ఆదేశించారు మంద్రి రాజనర్సింహ.

New Update
Corona: తెలంగాణలో మరో నాలుగు కరోనా కేసులు..

Telangana Corona Updates: తెలంగాణ కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. ఇప్పటికే 5 కేసులు నమోదవగా.. తాజాగా ఇవాళ మరో నాలుగు కొత్త కరోనా కేసులు (Corona Cases) నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు 9 కొత్త కరోనా కేసులు నమోదు అయ్యాయి. ఇక దేశ వ్యాప్తంగా కొత్తగా 142 కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా యాక్టివ్ కేసుల సంఖ్య 1,970కి చేరింది. కరోనా కారణంగా క‌ర్ణాట‌క‌లో ఒక‌రు మృతి చెందారు. సోమవారం నాడు కేర‌ళ‌లో (Kerala) ఐదుగురు, యూపీలో ఒక‌రు చనిపోయారు. దీంతో ఇటీవలి కాలంలో నమోదైన క‌రోనా మృతుల సంఖ్య ఏడుకు చేరింది.

కరోనా వ్యాప్తి నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. మంగళవారం నాడు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ (Damodar Raja Narasimha) వైద్యాధికారుతో అత్యవసర సమీక్షా సమావేశం నిర్వహించారు. కోవిడ్‌పై రివ్యూ నిర్వహించారు. కొత్త వేరియంట్ జేఎన్.1 పరిస్థితిపై మంత్రి ఆరా తీశారు. కొత్తవైరస్‌ను ఎదుర్కొనేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని దిశానిర్దేశం చేశారు. ముఖ్యంగా గాంధీ ఆసుపత్రిలో స్పెషల్ వార్డులను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అయితే, జేఎన్ 1 (JN.1) అనేది ఒమిక్రాన్ సబ్ వేరియంట్ అని, వాతావరణ మార్పులతో ఫ్లూ లక్షణాలతో కూడిన బాధితులు పెరిగే అవకాశం ఉందని వివరించారు వైద్యులు. కరోనాపై ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది.

భయం వొద్దు..

దేశ వ్యాప్తంగా విజృంభిస్తున్న కరోనా ప్రభావం, తీవ్రతపై భారతీయ వైద్యుల సంఘం తెలంగాణ విభాగం క్లారిటీ ఇచ్చింది. ఈ కరోనాపై ఆందోళన అవసరం లేదని తెలిపింది. ప్రస్తుతం వ్యాపిస్తోన్న జేఎన్.1 వేరియంట్ ఒమిక్రాన్ సబ్ వేరియంటేనని వివరించింది. మన దేశంతో పాటు మరికొన్ని దేశాల్లో ఈ వేరియంట్ వ్యాపిస్తోందని తెలిపారు. ఇది ప్రమాదకరం కాదంటూనే.. జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఇది ప్రమాదకరం కాదని డబ్ల్యూహెచ్‌ఓ (WHO) కూడా ప్రకటించిందని గుర్తు చేశారు. వృద్ధులు, దీర్ఘకాలిక జబ్బులు ఉన్నవారు అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

Also Read:

2024లో ఈ 4 రాశుల స్త్రీలకు పట్టిందల్లా బంగారమే..!

హైదరాబాదీలకు బిగ్ షాక్.. న్యూ ఇయర్ వేడుకలపై ఆంక్షలు..

Advertisment
తాజా కథనాలు