Revanth Reddy: నీ స్థాయి తగ్గించుకోకు రేవంత్.. వీహెచ్ సంచలన వ్యాఖ్యలు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కాంగ్రెస్ సీనియర్ లీడర్ వీహెచ్ సంచలన కామెంట్స్ చేశారు. ఇంటికి వెళ్లి పార్టీలోకి ఆహ్వానిస్తూ స్థాయిని తగ్గించుకోవద్దని సూచించారు. ఇదే విషయాన్ని కలిసి చెబుతామని ప్రయత్నిస్తుంటే టైం ఇవ్వడం లేదన్నారు. By Nikhil 23 Mar 2024 in రాజకీయాలు తెలంగాణ New Update షేర్ చేయండి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై సీనియర్ నేత వీ హన్మంతరావు సంచలన కామెంట్స్ చేశారు. 'రేవంత్ రెడ్డి నువ్వు ముఖ్యమంత్రివి.. నిన్ను కలవాలంటే నీ దగ్గరకు వాళ్ళు రావాలి. నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్లి ఆహ్వానించడం కరెక్ట్ కాదు. నీ స్థాయి నువ్వే తగ్గించుకుంటున్నావు' అని ఇటీవల పార్టీలో జరుగుతున్న చేరికలపై తనదైన శైలిలో వ్యాఖ్యానించారు. ఇదే విషయాన్ని రేవంత్ రెడ్డిని నేను కలిసి చెపుతామంటే టైమ్ ఇస్తలేడని అసంతృప్తి వ్యక్తం చేశారు వీహెచ్. తక్కువ సమయంలో ముఖ్యమంత్రి అయింది రేవంత్ రెడ్డి ఓక్కడేనన్నారు. పార్టీని బలోపేతం చేసి అసెంబ్లీ ఎన్నికల్లో గెలిపించాడన్నారు. కానీ ఇప్పుడు పరిస్థితులు చూసి కార్యకర్తలు బాధపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ కేడర్ కు న్యాయం చేయకుండా మన కార్యకర్తల పై కేసులు పెట్టినవాళ్లకు ఇప్పుడు ప్రాధాన్యత ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. #cm-revanth-reddy #vh-hanumanthrao మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి