Telangana Elections: మైనారిటీ డిక్లరేషన్ ప్రకటించిన కాంగ్రెస్.. అదిరిపోయే పథకాలు..

New Update
Telangana Elections: మైనారిటీ డిక్లరేషన్ ప్రకటించిన కాంగ్రెస్.. అదిరిపోయే పథకాలు..

Congress Minority Declaration: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నా కొద్ది.. ఓటర్లను తమవైపు లాగే ప్రయత్నాలను ముమ్మరం చేసింది రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ. ఇందులో భాగంగా తాజాగా మైనారిటీ డిక్లరేషన్‌ను ప్రకటించింది కాంగ్రెస్(Congress). కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రాష్ట్రంలోని మైనార్టీ ప్రజలందరికీ మేలు చేసే కార్యక్రమాలు చేపడతామన్నారు. ఈ మేరకు మైనారిటీ డిక్లరేషన్‌(Minority Declaration)లో కీలక పథకాలు, అంశాలను పేర్కొన్నారు. మరి కాంగ్రెస్ ప్రకటించిన మైనారిటీ డిక్లరేషన్‌లోని అంశాలు ఓసారి చూద్దాం..

మైనారిటీ డిక్లరేషన్‌లో కీలక పాయింట్స్..

👉 ఆర్థిక ఉద్ధరణ, సాధారికత.
👉 6 నెలల్లోపు కుల గణనను నిర్వహించి, ఉద్యోగాలు, విద్య, ప్రభుత్వ సంక్షేమ పథకాలలో మైనారిటీలతో సహా అన్ని వెనుకబడిన తరగతులకు న్యాయమైన రిజర్వేషన్లు ఉండేలా చూడాలి.
👉 మైనారిటీల సంక్షేమ బడ్జెట్‌ను రూ.4,000 కోట్లకు పెంచడంతోపాటు ప్రత్యేక మైనారిటీ సబ్ ప్లాన్.
👉 నిరుద్యోగ మైనారిటీ యువత, మహిళలకు సబ్సిడీ రుణాలను అందించడానికి సంవత్సరానికి 1,000 కోట్లు.
👉 విద్య, ఉపాధి ఈక్విటీకి నిబద్ధత.
👉 అబ్దుల్ కలాం తౌఫా-ఎ-తలీమ్ పథకం ద్వారా M.Phil పూర్తి చేస్తున్న ముస్లిం, క్రిస్టియన్, సిక్కు, ఇతర మైనారిటీ యువతకు రూ.5 లక్షల ఆర్థిక సహాయం.
👉 Ph.D. అదనంగా, పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తయిన తర్వాత రూ.1 లక్ష, గ్రాడ్యుయేషన్‌కు రూ.25,000, ఇంటర్మీడియట్‌కు రూ.15,000, 10వ తరగతికి రూ.10,000.
👉 తెలంగాణ సిక్కు మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్‌ని స్థాపించి, మైనారిటీ సంస్థలలో ఖాళీలను భర్తీ.
👉 ఉర్దూ మీడియం ఉపాధ్యాయుల నియామకానికి ప్రత్యేక డీఎస్సీ.
👉 మతపరమైన హక్కులు, సంస్కృతి రక్షణ.
👉 ఇమామ్‌లు, మ్యూజిన్‌లు, ఖాదీమ్‌లు, పాస్టర్‌లు, గ్రంథిలతో సహా అన్ని మతాల పూజారులకు నెలవారీ గౌరవ వేతనం రూ.10,000-12,000.
👉 వక్ఫ్ బోర్డు భూమి, ఆస్తి రికార్డులను డిజిటలైజ్.
👉 వక్ఫ్ బోర్డ్‌కు సంబంధించి ఆక్రమణకు గురైన ఆస్తులను తిరిగి తీసుకొని నమోదు చేయడం.
👉 ముస్లిం, క్రిస్టియన్ శ్మశాన వాటికల కోసం భూమి కేటాయింపు.
👉 ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద ఇళ్లులేని మైనారిటీ కుటుంబాలందరికీ ఇంటి స్థలం కేటాయించడం, ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షలు ఇవ్వడం జరుగతుంది.
👉 ముస్లింలు, క్రైస్తవులు, సిక్కులు ఇతర మైనారిటీలకు చెందిన కొత్తగా పెళ్లైన జంటలకు రూ. 1,60,000 సహాయం.
👉 SETWIN, నైపుణ్యాభివృద్ధి శిక్షణను పునరుద్ధరణ.
👉 హైదరాబాద్ ఓల్డ్ సిటీలో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడానికి కులీ కుతుబ్ షా అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (QQSUDA) ఏర్పాటు చేయడం జరుగుతుంది.

Also Read:

కేసీఆర్, రేవంత్, కిషన్ రెడ్డి.. సారథుల పొలిటికల్ హిస్టరీ..

మంత్రి కేటీఆర్‌కు ప్రమాదం.. గాయాలు..!

Advertisment
Advertisment
తాజా కథనాలు