KTR: కేటీఆర్ అమెరికా వెళ్లింది అందుకే.. కాంగ్రెస్ ఎమ్మెల్యే సంచలన ట్వీట్

ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడైన ప్రభాకర్ రావును కలిసేందుకే కేటీఆర్ అమెరికా వెళ్లాడని కాంగ్రెస్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ సంచలన ఆరోపణలు చేశారు. ఎక్కడ ఉ ఫోన్ ట్యాపింగ్ కి పాల్పడిన వారికి సహకరించిన వారిని వదిలి పెట్టేది లేదన్నారు.

New Update
KTR : నీతి ఆయోగ్ నివేదికపై కేటీఆర్ హర్షం.. కేసీఆర్ కృషి ఫలితమే అంటూ!

తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ తన 'X' ఖాతాలో చేసిన పోస్ట్ తెలంగాణ పాలిటిక్స్ లో ఆసక్తికరంగా మారింది. ఈ పోస్ట్ లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ టార్గెట్ గా విమర్శలు చేశారు. అధికార అహంకారంతో ఫోన్ ట్యాపింగ్ లు చేయించి, సొంత మనుషులను కూడా అనుమానించే పరిస్థితి తీసుకువచ్చిన నిన్ను వదిలిపెట్టేది లేదు కేటీఆర్ అంటూ హెచ్చరించారు. అమెరికాలో ఉన్నా.. ఆస్ట్రేలియా లో ఉన్నా.. ఫోన్ ట్యాపింగ్ కి పాల్పడిన వారికి సహకరించిన వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని ఆయన తన పోస్ట్ లో పేర్కొన్నారు.

ఇంకా తన సోషల్ మీడియా పోస్ట్ లో ఆయన అనేక సంచలన ఆరోపణలు చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక నిందితుడైన ప్రభాకర్ రావు.. తనను అరెస్ట్ చేస్తే నిజాలు బయట పెడతానని బెదిరించాడన్నారు. దీంతోనే కేటీఆర్ హుటాహుటిన అమెరికా బయలుదేరి వెళ్లాడన్నారు. తన పేరు రాకుండా తప్పుంచుకునేందుకే కేటీఆర్ తాపత్రయపడుతున్నాడన్నారు.

నెలరోజులుగా కేటీఆర్ సన్నిహితుల కస్టడీలోనే ప్రభాకర్ రావు ఉంటున్నాడని ఆరోపించారు. ఇంకా పోలీసులకు దొరకొద్దు అని కేసీఆర్ వేడుకుంటున్నాడని సంచలన ఆరోపణలు చేశారు. ఇండియా రావొద్దు.. అక్కడే తలదాచుకోవాలని ఫోన్లో కేసీఆర్ ప్రభాకర్ రావును కోరాడన్నారు. బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తే రాజ్యసభ ఎంపీ పదవి ఇస్తామని ప్రభాకర్ రావుకు హామీ ఇచ్చాడని తన ట్వీట్లో పేర్కొన్నారు కవ్వంపల్లి.

Also Read : వైసీపీ నేతలకు హైకోర్టు బిగ్ షాక్

Advertisment
తాజా కథనాలు