Congress : రేవంత్‌ ప్రభుత్వానికి 100 రోజులు పూర్తి.. అమలైన హామీలు 5!

100 రోజుల పాలన పై ప్రగతి నివేదికను కాంగ్రెస్‌ ప్రభుత్వం విడుదల చేసింది. ఆ ప్రగతి నివేదికలో మహాలక్ష్మి పథకం , ఆరోగ్యశ్రీ పరిమితి పెంపు, గ్యాస్‌ సిలిండర్‌ రాయితీ వంటి కార్యక్రమాలతో కలిపి మొత్తం 5 హామీలను అమలు చేశామని పేర్కొంది.

New Update
CM Revanth: రైతు రుణమాఫీపై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..ఆగస్టు 15 నాటికి..!

Telangana : తెలంగాణ(Telangana) లో కొత్త ప్రభుత్వం ఏర్పడి మార్చి 15 తో వంద రోజులు పూర్తయ్యాయి. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తరువాత పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కానీ కాంగ్రెస్‌ ప్రభుత్వానికి(Congress Government) మాత్రం ప్రజలు రోజులు లెక్కబెడుతున్నారు. ఎందుకంటే.. ఎన్నికల ముందు కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని హామీ ఇచ్చింది.

అందుకు 100 రోజులు అంటూ టార్గెట్ పెట్టుకుంది. కాగా ఈ 100 రోజుల పాలన పై ప్రగతి నివేదికను కాంగ్రెస్‌ ప్రభుత్వం విడుదల చేసింది.
అధికారం చేపట్టిన 48 గంటల్లోనే మహాలక్ష్మి పథకానికి శ్రీకారం చుట్టింది. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించింది. ఆరోగ్యశ్రీ(Arogyasri) పరిమితి పెంపు, గ్యాస్‌ సిలిండర్‌ రాయితీ కూడా మహాలక్ష్మి పథకంలో భాగమే.

గృహజ్యోతి పథకం(Gruha Jyothi Scheme) కింద జీరో విద్యుత్‌ బిల్లు కూడా ఇటీవలే అమలులోకి వచ్చింది. రైతు భరోసా ఎలాగూ అమల్లోకి వచ్చింది. చేయూత అనే హామీలో సగం అమల్లోకి వచ్చింది. పెన్షన్ల పెంపుకి కొత్త రేషన్‌ కార్డులు ముడిపడడంతో అది ఆలస్యమైంది. యువతకు విద్యా భరోసా కార్డు, ఇంటర్నేషనల్‌ స్కూల్స్ నిర్మాణం వంటి హామీలున్న యువ వికాసం ఇంకా అమల్లోకి రాలేదు. హామీలన్ని ఇంకా పూర్తి స్థాయిలో అమలు కాకపోయినా కూడా ఐదు గ్యారెంటీలు అమలు అయిపోయాయని చెప్పేసుకుంటుంది కాంగ్రెస్‌ ప్రభుత్వం.

ఈ ఆరు గ్యారెంటీలతో పాటు ఇంకా చాలా అభివృద్ది కార్యక్రమాలను అమలు చేశామని కాంగ్రెస్‌ విడుదల చేసిన ప్రగతి నివేదికలో పేర్కొంది. గత ప్రభుత్వంలో జరిగిన అవినీతి, అక్రమాలు ప్రజలకు తెలిసేలా శ్వేతాపత్రాలు విడుదల చేసి విచారణలు చేపట్టామని , విచారణల కోసం కమిషన్లు ఏర్పాటు చేశామని వివరించింది.

డబుల్‌ డెక్కర్‌ కారిడార్‌(Double Decker Corridor) కు పునాది, మెట్రో ఫేజ్‌ 2 విస్తరణకు శంకుస్థాపన, గవర్నమెంట్‌ ఐటీఐల్లో అడ్వాన్స్ డ్ టెక్నాలజీ సెంటర్ల ఏర్పాటుకు ఒప్పందం, దావోస్‌ నుంచి పెట్టుబడులు , 30 వేల ఉద్యోగాలు ధరణి సమస్యలు పరిష్కారానికి కమిటీ, నోటిఫికేషన్లు, ఉద్యోగ నియామకాలు ఇలాంటి వాటిని అన్నింటిని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం తన ఖాతాలోనే వేసుకుంది.

Also Read : ఇండియన్ బ్యాంకులో భారీగా ఉద్యోగాలు.. అర్హులైతే వెంటనే అప్లై చేఏయండి!

Advertisment