TS Congress: మరికొన్ని గంటల్లో కాంగ్రెస్ జాబితా.. 58 మందితో ఫస్ట్ లిస్ట్?

రేపు మేనిఫెస్టో విడుదల చేయాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సిద్ధం అవుతున్న వేళ.. 58 మందితో ఫస్ట్ లిస్ట్ విడుదల చేయడానికి సిద్ధం అవుతోంది కాంగ్రెస్. మరికొన్ని గంటల్లోనే కాంగ్రెస్ ఫస్ట్ లిస్ట్ విడుదల కానుంది. రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి తదితర ప్రముఖ సీట్లు ఈ జాబితాలో ఉండనున్నాయి.

New Update
TS Congress: మరికొన్ని గంటల్లో కాంగ్రెస్ జాబితా.. 58 మందితో ఫస్ట్ లిస్ట్?

ముందు అనుకున్న విధంగా కాంగ్రెస్ అభ్యర్థుల తొలిజాబితా మరికొన్ని గంటల్లో విడుదల కానుంది. ఢిల్లీలో సమావేశమైన కాంగ్రెస్ నేతలు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. జాబితా ఆలస్యం కావటంపై నేతలపై రాహుల్ సీరియస్ అయ్యారు. ఈ వ్యవహారాన్ని త్వరగా తేల్చాలంటూ కేసీవేణుగోపాల్ కు ఆదేశాలు జారీ చేశారు. దాంతో తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జి, స్క్రీనింగ్ కమిటీ ఛైర్మన్ మురళీధరన్ తోపాటు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జిగ్నేష్ మేవాని తదితరులు పాల్గొన్నారు. 58 మందితో తొలిజాబితాను ఖరారు చేశారు. మరో రెండు రోజుల్లో మిగిలిన పేర్లను ప్రకటిస్తామని స్క్రీనింగ్‌ కమిటీ ఛైర్మన్‌ మురళీధర్‌ వెల్లడించారు. గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నవారికి, పార్టీకి విధేయులుగా ఉన్న నేతలను అభ్యర్థులుగా ఎంపిక చేశామని తెలిపారు. అన్ని సామాజిక వర్గాలకు సీట్ల కేటాయింపు ఉంటుందని స్పష్టం చేశారు.
ఇది కూడా చదవండి: Kishan Reddy: కాంగ్రెస్ ఆఖరికి ఆవు పేడను కూడా వదలదు.. పొన్నాల లక్ష్మయ్య పెనంలోంచి పొయ్యిలో: కిషన్ రెడ్డి

కాంగ్రెస్‌తో వామపక్షాల పొత్తు దాదాపు ఖరారైనట్లు సమాచారం. సీపీఐకి రెండు, సీపీఎంకు రెండు లెక్కన నాలుగు స్థానాలు ఇచ్చేందుకు సూత్రప్రాయంగా కాంగ్రెస్‌ అంగీకరించినట్లు సమాచారం అయితే వామపక్షాలు కోరుతున్న నాలుగు స్థానాలు కూడా ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో ఉండడం, ఆ రెండు జిల్లాల్లోనే కాంగ్రెస్‌ కూడా బలంగా ఉండటంతో.. సీట్ల సర్దుబాటు విషయంలో కొంత గందరగోళం ఏర్పడినట్టు సమాచారం.

ఉమ్మడి నల్గొండ జిల్లాలో మునుగోడు, దేవరకొండ, మిర్యాలగూడ, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కొత్తగూడెం, పాలేరు, హుస్నాబాద్‌, భద్రాచలం నియోజకవర్గాల్లో తమకు నాలుగు కేటాయించాలని వామపక్షాలు కోరినట్లు తెలుస్తోంది. సీట్ల సర్దుబాటుకు సంబంధించి సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎంపీ ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డిలతో చర్చిస్తున్నట్లు సమాచారం.

ఈ నియోజకవర్గాలల్లో తమకే టికెట్లు వస్తాయని.. ఇప్పటికే కాంగ్రెస్‌ నాయకులు విశ్వాసంతో పని చేసుకుంటూ పోతుండడంతో.. పొత్తుల్లో ఆయా సీట్లు కేటాయించేందుకు మొదట స్థానిక నాయకత్వంతో కూడా మాట్లాడి ఒప్పించి సర్దుబాటు చేసేందుకు చొరవ చూపుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఖమ్మం జిల్లాలో కొత్తగూడెంలో కూనంనేని సాంబశివరావును సర్దుబాటు చేయటానికి, తుమ్మలను ఖమ్మానికి, పొంగులేటికి పాలేరు టిక్కెట్లు కేటాయించినట్టు సమాచారం.ఈ వ్యవహారం కూడా ఆదివారం ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉందని స్క్రీనింగ్‌ కమిటీ ఛైర్మన్‌ మురళీధరన్‌ వెల్లడించారు.

కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపికకు సంబంధించి స్క్రీనింగ్ కమిటీ దఫదఫాలుగా చర్చించింది. తమకు సరైన ప్రాతినిధ్యం కల్పించాలని కోరుతూ వివిధ వర్గాల నుంచి డిమాండ్లు అధికంగా రావటం, మరోవైపు నేతల చేరికలు కూడా అధికంగా ఉండటంతో.. టిక్కెట్ల ఎంపిక పార్టీకి సవాలుగా మారింది.

Advertisment
తాజా కథనాలు