Telangana Congress: కాంగ్రెస్ హైకమాండ్ కు బీసీ నేతల షాక్.. రేపు గాంధీభవన్ లో దీక్ష.. వివరాలివే!

కాంగ్రెస్ లో బీసీలకు 34 టికెట్లు ఇవ్వాల్సిందేనని ఆ వర్గం నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఇదే డిమాండ్ తో రేపు గాంధీభవన్ వద్ద ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిరసన చేపట్టనున్నట్లు ప్రకటించారు.

New Update
T Congress : స్పీడ్ పెంచిన టీకాంగ్రెస్.. అభ్యర్థుల తొలి జాబితా సిద్ధం!

కాంగ్రెస్ పార్టీలో (Congress Party) టికెట్ల పంచాయితీ రోజుకో మలుపు తిరుగుతోంది. నిన్న ఆదివాసీలు గాంధీభవన్ (Gandhi Bahvan) ఎదుట ధర్నా నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ ఘటన మరవకముందే మరోసారి బీసీ నేతలు ఏకంగా గాంధీభవన్ లో దీక్ష చేపట్టాలని నిర్ణయించినట్లు వార్తలు రావడం కాంగ్రెస్ పెద్దలను కలవరానికి గురి చేస్తోంది. బీసీలకు 34 టికెట్లు ఇవ్వాల్సిందేనని ఆ వర్గం నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు బీసీ నేతలు కత్తి వెంకటస్వామి, చెరుకు సుధాకర్ (Cheruku Sudhakar), సంగిశెట్టి జగదీశ్, వెంకటేష్‌, రేణుక తదితరులు ఈ రోజు గాంధీభవన్ లో ప్రెస్ మీట్ నిర్వహించారు.
ఇది కూడా చదవండి: బీజేపీలోకి ఆ నలుగురు… బీఆర్‌ఎస్‌ కు పెద్ద షాక్‌

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రేపు ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు గాంధీభవన్ లో నిరసన చేపట్టనన్నట్లు ప్రకటించారు. తమ పార్టీలో కేసీఆర్ కోవర్టులు ప్రవేశిస్తున్నారని ధ్వజమెత్తారు. మైనంపల్లి బీఆర్ఎస్ ఎంఎల్ఏగా ఉంటే కాంగ్రెస్ పార్టీ చేపట్టిన సర్వేలో ఎలా గెలుస్తారు అని వస్తుందని ప్రశ్నించారు.

నందికంటి శ్రీధర్ ఓడిపోతడని ఆ సర్వేలో ఎలా తేలిందన్నారు. ఓబీసీ కోట కింద తమకు తగిన సీట్లు ఇవ్వాల్సిందేనన్నారు. బీసీలకు టిక్కెట్లు కేటాయించాలని అనుకునే కాంగ్రెస్ పార్టీలోని బీసీలంతా రేపు ఉదయం 11 గంటలకు గాంధీభవన్ కు రావాలని పిలుపునిచ్చారు. రాహుల్ గాంధీ ఇచ్చిన హామీని నెరవేర్చమని బీసీ నేతలము అడుగుతున్నామన్నారు.

Advertisment
తాజా కథనాలు