Telangana: తెలంగాణ ప్రజలు ఎంతో ఆసక్తిగా, ఉత్కంఠగా ఎదురు చూస్తున్న ఆరు గ్యారెంటీల అమలుకు రంగం సిద్ధమైంది. ఇప్పటికే ఆ పథకాలకు సంబంధించి అప్లికేషన్ ఫామ్ రెడీ అయినట్లు ప్రచారం జరుగుతోంది. బుధవారం నాడు ఈ పథకానికి సంబంధించిన అప్లికేషన్ ఫామ్ అందుబాటులోకి రానుందని సమాచారం. 28వ తేదీన ప్రజా పాలన కార్యక్రమంలో దరఖాస్తులను స్వీకరించనున్నారు. అయితే, ఈ అప్లికేషన్ ఫామ్‌లో రెండు విభాగాలు ఉన్నాయి. మొదటి విభాగంలో దరఖాస్తుదారుల వివరాలు, రెండో విభాగంలో పథకాలకు సంబంధించిన అర్హతలు పేర్కొనడం జరిగింది. ఈ దరఖాస్తు ఫారమ్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
కొత్త రేషన్ కార్డ్‌ల అప్లికేషన్ ఫామ్ రెడీ..?
ఇదిలాఉంటే.. లక్షలాది మంది ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్న కొత్త రేషన్ కార్డులకు సంబంధించిన దరఖాస్తు ఫామ్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కొత్త కార్డులు, మార్పులు-చేర్పులు, బదిలీలకు ప్రభుత్వం వేర్వేరుగా ఫామ్‌లు సిద్ధం చేసిందని సమాచారం. ఈ నెల 28వ తేదీ నుంచి కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తులను స్వీకరించనున్నట్లు తెలుస్తోంది. రేషన్ కార్డుల కోసం తెలంగాణ వ్యాప్తంగా లక్షలాది మంది ప్రజలు ఎదురు చూస్తున్నారు. కాగా, తెలంగాణలో ఇప్పటికే 89 లక్షలకు పైగా రేషన్ కార్డులు ఉన్నాయి. అయితే, ప్రభుత్వం త్వరలో అమలు చేయనున్న ఆరోగ్య శ్రీ, నెలకు రూ. 2,500, రూ. 500 సిలిండర్ పథకాలకు రేషన్‌కార్డుకు లింక్ పెట్టింది. దీంతో అర్హులైన ప్రజలు ఈ పథకాలకు దరఖాస్తు చేసుకునేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
Also Read:
పార్లమెంట్ ఎన్నికలు ఎప్పుడో చెప్పేసిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి..
ఆరు గ్యారెంటీలకు ఇలా అప్లై చేసుకోండి.. క్లారిటీ ఇచ్చిన మంత్రి..