Telangana : ఏపీతో తెగిన ఉమ్మడి బంధం.. హైదరాబాద్‌ ఇక పూర్తిగా తెలంగాణకే!

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వేరుపడిన తర్వాత రాజధాని లేని విభజిత ఏపీకి హైదరాబాద్‌ను పదేళ్లపాటు ఉమ్మడిగా రాజధానిగా కొనసాగిస్తూ కేంద్రం ప్రకటించింది. ఈ గడువు నిన్నటితో ముగిసింది. ఇకపై హైదరాబాద్ తెలంగాణకు శాశ్వత రాజధానిగా కొనసాగనుంది.

Hyderabad : ఇక నుంచి రాత్రి 10.30 కల్లా షాపులు మూసివేయాల్సిందే!
New Update

Telangana Common Capital : ఆంధ్రప్రదేశ్‌ - తెలంగాణ (Andhra Pradesh - Telangana) మధ్య సుమారు పది సంవత్సరాల పాటు కొనసాగిన ఉమ్మడి బంధం (Common Relation) ఇక ముగిసింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వేరుపడిన తర్వాత రాజధాని (Capital) లేని విభజిత ఏపీకి హైదరాబాద్‌ను పదేళ్లపాటు ఉమ్మడిగా రాజధానిగా కొనసాగిస్తూ కేంద్రం ప్రకటించింది. ఈ గడువు నిన్నటితో ముగిసింది. ఇకపై హైదరాబాద్ తెలంగాణకు శాశ్వత రాజధానిగా కొనసాగనుంది.

విభజన జట్టంలోని సెక్షన్-8 ప్రకారం హైదరాబాద్ (Hyderabad) ఉమ్మడి రాజధాని ప్రాంతంలో పౌరుల ప్రాణ, ఆస్తి, రక్షణ, భద్రతను కాపాడే బాధ్యతను గవర్నర్‌కు అప్పగించారు. ఇప్పుడీ గడువు ముగియడంతో ఈ బాధ్యతను ప్రభుత్వమే చూసుకుంటుంది.

ఏపీకి హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉన్నప్పటికీ విభజిత ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు 2015లోనే అమరావతిని రాజధానిగా ప్రకటించి పాలన అందించారు. 2019లో అధికారాన్ని చేజిక్కించుకున్న వైఎస్ జగన్ మూడు రాజధానుల అంశాన్ని తెరపైకి తీసుకుని వచ్చారు. మరోసారి అవకాశం ఇస్తే విశాఖ ను రాజధానిగా చేసుకుని పరిపాలన సాగిస్తామని అన్నారు.

Also read:  బలగం వేణుకి భారీ షాకిచ్చిన నేచురల్‌ స్టార్‌!

#andhra-pradesh #telangana #ten-years #telangana-common-capital
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe