Manneguda: సీఎం రేవంత్ కు పెను ప్రమాదం తప్పింది. ఆయన కొడంగల్ వెళ్తున్న సమయంలో కాన్వాయ్‌లో ల్యాండ్ క్రూజర్ వాహనం టైర్ ఒక్కసారిగా పేలింది. దీంతో వెంటనే అలర్ట్ అయిన అధికారులు లాండ్ క్రూజర్‌కు మరమ్మతులు చేపట్టారు. వికారాబాద్ జిల్లా మన్నెగూడ వద్ద ఈ ఘటన జరగగా.. తృటిలో సీఎంకు ప్రమాదం తప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సివుంది.
ఇది కూడా చదవండి: TS: కాంగ్రెస్ మేనిఫెస్టో హిందువులకు వ్యతిరేకం.. కిషన్ రెడ్డి