CM Revanth Reddy: నేడు ఢిల్లీకి సీఎం రేవంత్.. అధిష్టానంతో కీలక భేటీ!

నేడు సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లనున్నారు. పార్టీ హైకమాండ్‌తో భేటీ కానున్నారు. నామినేట్ పదవులు, పీసీసీ అధ్యక్షుడి ఎంపికపై అధిష్టానంతో చర్చించనున్నారు. రాజీవ్ గాంధీ విగ్రహం ఆవిష్కరణకు హాజరుకావాలని సోనియా, రాహుల్ గాంధీని ఆహ్వానించనున్నారు.

CM Revanth Reddy: నేడు ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి.. రాహుల్‌తో భేటీ
New Update

CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి మరోసారి హస్తినకు వెళ్లనున్నారు. సీఎం వెంట డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కూడా ఉన్నారు. ఈరోజు ఢిల్లీలో కాంగ్రెస్ హైకమాండ్ నేతలతో సమావేశం కానున్నారు. కేబినెట్ విస్తిరణ, . నామినేట్ పదవులు, పీసీసీ అధ్యక్షుడి ఎంపికపై అధిష్టానంతో చర్చించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఈరోజు కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, సోనియా గాంధీతో సీఎం రేవంత్ భేటీ కానున్నారు. తెలంగాణ సచివాలయం ఎదుట ఏర్పాటు చేసిన రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు వారిని ఆహ్వానించనున్నారు. కాగా తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్ర నూతన అధ్యక్షుడు ఎవరు అనేదానిపై ఈరోజు క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం.

రాజీవ్ గాంధీతో రగడ...

తెలంగాణ రాజకీయాల్లో రాజీవ్ గాంధీ పేరు హాట్ టాపిక్ గా మారింది. ఇందుకు ప్రధాన కారణం సచివాలయం ఎదుట రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టడం. రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పెట్టడాన్ని బీఆర్ఎస్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. తెలంగాణ తల్లి విగ్రహం స్థానంలో రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఎలా పెడతారని విమర్శలు గుప్పించింది. తాము అధికారంలోకి రాగానే కాంగ్రెస్ పెడుతున్న రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తొలిగించి.. ఆ స్థానంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని పలు మార్లు కేటీఆర్ స్పష్టం చేశారు. అలాగే శంషాబాద్ విమానాశ్రయానికి రాజీవ్ గాంధీ పేరు తొలిగించి.. జయశంకర్ లేదా నర్సింహారావు పేర్లను పెడతామని కేటీఆర్ అన్నారు.

మరో అడుగు వేసిన సర్కార్...

రాజీవ్ గాంధీ విగ్రహంపై బీఆర్ఎస్ చేస్తున్న దాడిని తిప్పి కొట్టేందుకు కాంగ్రెస్ కీలక నిర్ణయం తీసుకుంది. సచివాలయం ఎదుట రాజీవ్ గాంధీ విగ్రహంతో పాటు తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు స్థలం కోసం సచివాలయంలో చూశారు. త్వరలోనే సచివాలయం ఎదుట తెలంగాణ తాల్లో విగ్రహాన్ని ఏర్పాటు చేయనుంది రేవంత్ సర్కార్. మరో వైపు కేటీఆర్ చేస్తున్న విమర్శలపై సీఎం రేవంత్ సీరియస్ అయ్యారు. పదేళ్లు అధికారంలో ఉన్న మీరు తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఎందుకు ఏర్పాటు చేయలేదు అని ప్రశ్నించారు. రాజకీయ లబ్ది కోసమే ఎలాంటి విమర్శలకు కేటీఆర్ దిగుతున్నారని ఫైర్ అయ్యారు.

#cm-revanth-reddy
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe