CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి మరోసారి హస్తినకు వెళ్లనున్నారు. సీఎం వెంట డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కూడా ఉన్నారు. ఈరోజు ఢిల్లీలో కాంగ్రెస్ హైకమాండ్ నేతలతో సమావేశం కానున్నారు. కేబినెట్ విస్తిరణ, . నామినేట్ పదవులు, పీసీసీ అధ్యక్షుడి ఎంపికపై అధిష్టానంతో చర్చించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఈరోజు కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, సోనియా గాంధీతో సీఎం రేవంత్ భేటీ కానున్నారు. తెలంగాణ సచివాలయం ఎదుట ఏర్పాటు చేసిన రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు వారిని ఆహ్వానించనున్నారు. కాగా తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్ర నూతన అధ్యక్షుడు ఎవరు అనేదానిపై ఈరోజు క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం.
పూర్తిగా చదవండి..CM Revanth Reddy: నేడు ఢిల్లీకి సీఎం రేవంత్.. అధిష్టానంతో కీలక భేటీ!
నేడు సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లనున్నారు. పార్టీ హైకమాండ్‌తో భేటీ కానున్నారు. నామినేట్ పదవులు, పీసీసీ అధ్యక్షుడి ఎంపికపై అధిష్టానంతో చర్చించనున్నారు. రాజీవ్ గాంధీ విగ్రహం ఆవిష్కరణకు హాజరుకావాలని సోనియా, రాహుల్ గాంధీని ఆహ్వానించనున్నారు.
Translate this News: