6 Guarantees Applications :ఆరు గ్యారంటీల పథకాల అమలు దరఖాస్తులను బయట అమ్మడంపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సీరియస్‌గా ఉన్నారు. దరఖాస్తుల పంపకం సక్రమంగా జరిగేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. దీనికి సంబంధించి అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. దరఖాస్తులను అమ్ముతున్నారంటూ వస్తున్న వార్తల మీద రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ అమ్మకాల మీద వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రజాపాలన దరఖాస్తులు అందరికీ చేరేలా చూడాలని అధికారులకు ఆదేశించారు. అవసరమైనన్ని ఫామ్‌లను అందుబాటులో ఉంచాల్సిందేనని చెప్పారు.
Also read:గ్యాంగ్‌స్టర్ లఖ్బీర్ సింగ్ ఉగ్రవాదే..భారత ప్రభుత్వం ప్రకటన
ఇక రైతు భరోసా, పెన్షన్ల మీద అపోహలొద్దని...పాత లబ్ధిదారులందరికీ యథాతథంగా అవి అందుతాయని హామీ ఇచ్చారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కొత్తగా పొందాలనుకునే వారు మాత్రం దరఖాస్తు చేసుకోవల్సిందేనని చెప్పారు. దరఖాస్తుల మీద జనాలకు ఉన్న సందేహాలను అన్నింటినీ తీర్చాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు.
ఇక మరోవైపు ప్రజాపాలన కార్యక్రమంలో మొదటి రోజు కంటే రెండో రోజే ఎక్కువ దరఖాస్తులు వచ్చినట్లు ప్రభుత్వ అధికారులు వెల్లడించారు. రెండో రోజు రాష్ట్ర వ్యాప్తంగా 8,12,862 దరఖాస్తులు వచ్చినట్లు ప్రకటించారు. గ్రామీణ ప్రాంతాల్లో 3,23,862 దరఖాస్తులు వచ్చాయని.. జిహెచ్ఎంసీ(GHMC), పట్టణ ప్రాంతాల్లో నుంచి మొత్తం 4.89 లక్షల దరఖాస్తులు వచ్చినట్లు పేర్కొన్నారు. తొలి రోజున రాష్ట్రవ్యా ప్తంగా 7.46 7468 లక్షల దరఖాస్తులు వస్తే రెండో రోజున 8.12 లక్షలు వచ్చినట్లు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శాంతికుమారి తెలిపారు. రెండు రోజుల్లో వచ్చిన మొత్తం దరఖాస్తుల్లో పల్లెల నుంచి 6.12 లక్షలు వస్తే, పట్టణాల నుంచి 9.46 లక్షలు వచ్చినట్లు తెలిపారు.