Telangana CM Revanth Reddy: తెలంగాణలో డ్రగ్స్ ఇష్యూను సీఎం రేవంత్ రెడ్డి సీరియస్‌గా తీసుకున్నారు. డ్రగ్స్ రహిత తెలంగాణే లక్ష్యంగా అడుగులు వేస్తున్నారు. డ్రగ్స్ విక్రయించినా.. వినియోగించినా కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు సీఎం రేవంత్. అంతేకాదు.. గ్రే హౌండ్స్, అక్టోపస్ తరహాలో.. డ్రగ్స్ కంట్రోల్ టీమ్ ఏర్పాటు దిశగా ప్లాన్ చేస్తున్నారు. యాంటీ నార్కొటిక్ బ్యూరో డైరెక్టర్‌గా సందీప్ శాండిల్యను నియమించాలని భావిస్తున్నారు. సందీప్ శాండిల్యకు సిన్సియర్ ఆఫీసర్‌గా పేరుంది. ఆ కారణంగానే.. ఆయన్ను యాంటీ నార్కొటిక్ బ్యూరో డైరెక్టర్‌గా నియమించాలని నిర్ణయించారు. అంతేకాదు.. డ్రగ్స్ వ్యవహారంలో పాత కేసులన్నింటినీ బయటకు తీయాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు.
టాలీవుడ్‌లో ప్రకంపనలు..
సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో టాలీవుడ్‌లో పెను ప్రకంపనలు మొదలయ్యాయి. గతంలో అనేక సందర్భాల్లో నమోదైన డ్రగ్స్ కేసుల్లో సినీ ప్రముఖుల పేర్లు బయటకు వచ్చాయి. ఆ సమయంలో టాలీవుడ్ ప్రముఖుల్లో కొందరిని విచారించి వదిలేశారు పోలీసులు. దీంతో.. డ్రగ్స్ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకుంది ప్రభుత్వం. డ్రగ్స్ దందా వెనుక ఉన్నది ఎవరు? డ్రగ్స్ సరఫరా చేస్తున్నదెవరు? డ్రగ్స్ లింకుల్ని బయటకు లాగే పనిలో రేవంత్ సర్కార్ నిమగ్నమైంది.
Also Read:
10వ తరగతి అర్హతతో ఇస్రోలో ఉద్యోగాలు.. 50 వేలకు పైనే జీతం.. వివరాలివే..