Revanth Reddy: అయోధ్యకు, భద్రాచలం రామాలయానికి మధ్య నాకు ఎలాంటి తేడా కనిపించడం లేదు- సీఎం

రామాలయం హిందువులందరికీ చెందుతుందన్నారు తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి. ఎన్నికలకు ముందు బీజేపీ మత రాజకీయాలు చేస్తోందని ఆరోపించారు. అయోధ్యకు, భద్రాచలం రామాలయానికి మధ్య తనకు ఎలాంటి తేడా కనిపించడం లేదన్నారు. 'ఇండియా టుడే టీవీ'కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో రేవంత్ ఈ వ్యాఖ్యలు చేశారు.

New Update
Revanth Reddy: అయోధ్యకు, భద్రాచలం రామాలయానికి మధ్య నాకు ఎలాంటి తేడా కనిపించడం లేదు- సీఎం

Revanth Reddy on Ayodhya: జనవరి 22, 2024న అయోధ్య(Ayodhya)లోని రామ్‌లల్లా ప్రాణ్ ప్రతిష్ఠ కార్యక్రమానికి సన్నాహాలు జోరందుకున్నాయి. ప్రస్తుతం దేశమంతా అయోధ్య వైపే చూస్తోంది. ఓవైపు భక్తితో పాటు మరోవైపు రాజకీయాలు సైతం అయోధ్య రామాలయం చుట్టూనే తిరుగుతున్నాయి. రాంమందిరాన్ని బీజేపీ ఓటు బ్యాంక్‌ కోసం వాడుకుంటోందని యాంటీ-ఎన్డీఏ పార్టీలు ఆరోపిస్తున్నాయి. మరోవైపు తమ పార్టీకి వ్యతిరేకంగా ఎలాంటి కామెంట్స్ చేసినా బీజేపీ వారికి యాంటి-హిందూ ట్యాగ్ వేస్తోంది. ముఖ్యంగా అయోధ్య ప్రాణ్‌ ప్రతిష్ఠ విషయంలో బీజేపీ, కాంగ్రెస్‌ మధ్య మాటల యుద్ధం అంతకంతకూ పెరుగుతోంది. తాజాగా ప్రముఖ మీడియా సంస్థ 'ఇండియా టుడే(INDIA TODAY)'కి ఇచ్చిన ఇంటర్య్యూలో తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి(Revanth Reddy) బీజేపీపై విరుచుకుపడ్డారు.

publive-image 'ఇండియా టుడే టీవీ'కి రేవంత్ ప్రత్యేక ఇంటర్వ్యూ

మత రాజకీయాలు చేస్తున్నారు:
జనవరి 22న జరగనున్న అయోధ్యలోని రామమందిరం (Ayodhya Ram Mandir) ప్రాణ ప్రతిష్ఠకు నలుగురు శంకరాచార్యులు హాజరు కాకూడదని నిర్ణయించుకున్న విషయం తెలిసిందే. ప్రధాని మోదీ టార్గెట్‌గా శంకరాచార్యులు ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ విషయంలో బీజేపీ కార్యకర్తలు, శంకరాచార్యుల మద్దతుదారుల మధ్య సోషల్‌మీడియాలో వార్‌ నడుస్తోంది. తాజాగా ఈ వివాదంపై రేవంత్ రెడ్డి స్పందించారు. రామాలయం హిందువులందరికీ చెందుతుందన్నారు. లోక్‌సభ ఎన్నికలకు ముందు మత రాజకీయాలు చేస్తుందని విమర్శించారు. 'ఇండియా టుడే టీవీ'కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో రేవంత్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు.

తేడా కనిపించడం లేదు:
రామమందిరం హిందువులందరికీ చెందుతుందని.. ఈ గుడితో బీజేపీతో (BJP) ఎలాంటి సంబంధం లేదన్నారు రేవంత్‌. బీజేపీ మత రాజకీయాలు ఆడుతోందని ఆరోపించిన రేవంత్‌.. ఇటీవల నలుగురు శంకరాచార్యులు అయోధ్యకు ఆలయం అసంపూర్తిగా ఉన్నందున వెళ్లబోమని చెప్పిన విషయాన్ని ప్రస్థావించారు. తెలంగాణలోని భద్రాచలంలో ఉన్న రామమందిరాన్ని తాను దర్శించుకునేవాడినని చెప్పుకొచ్చిన రేవంత్.. అయోధ్యకు, భద్రాచలం రామాలయానికి మధ్య తనకు ఎలాంటి తేడా కనిపించడం లేదని తెలిపారు.

ఇక రామమందిరంలో ప్రాణ్‌ ప్రతిష్ఠ కార్యక్రమానికి కాంగ్రెస్‌ హాజరుకావడం లేదు.. తమది మతపరమైన ఆచారాలను వ్యతిరేకించే 'నాస్తిక పార్టీ' కాదని చెప్పిన కాంగ్రెస్... అయోధ్యలో జరుగుతున్నది 'రాజకీయ' కార్యక్రమంగా అభివర్ణించింది. అందుకే ఈ ఆహ్వానాన్ని తిరస్కరించినట్టు తెలిపింది. లోక్‌సభ ఎన్నికల కారణంగా జనవరి 22న ఈ కార్యక్రమాన్ని హడావుడిగా నిర్వహిస్తున్నారని కాంగ్రెస్‌ ఆరోపిస్తోంది.

Also Read: పాత విగ్రహం కూడా కొత్త దానితో పాటూ గర్భగుడిలోనే ఉంటుంది-క్లారిటీ ఇచ్చిన ట్రస్ట్

WATCH:

Advertisment
Advertisment
తాజా కథనాలు