Revanth Reddy: గ్రే హౌండ్స్, ఆక్టోపస్ మాదిరిగా యాంటీ నార్కొటిక్​బ్యూరో.. సీఎం రేవంత్ రెడ్డి సంచలన ఆదేశాలు

తెలంగాణలో ఇక నుండి డ్రగ్స్ అనే మాట వినబడవద్దని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. వ్యవసాయం, నార్కోటిక్ అండ్‌ డ్రగ్స్, ఎక్సైజ్, టీఎస్‌పీఎస్సీ, సింగరేణిలపై సోమవారం ఆయన సుదీర్ఘంగా ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. అధికారులకు కీలక సూచనలు చేశారు.

Revanth Reddy: గ్రే హౌండ్స్, ఆక్టోపస్ మాదిరిగా యాంటీ నార్కొటిక్​బ్యూరో.. సీఎం రేవంత్ రెడ్డి సంచలన ఆదేశాలు
New Update

Revanth Reddy: తెలంగాణ రాష్ట్రంలో ఇక నుండి డ్రగ్స్ అనే మాట వినపడవద్దని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఐదు కీలక విభాగాలపై సోమవారం ఆయన ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. వ్యవసాయం, నార్కోటిక్ అండ్‌ డ్రగ్స్, ఎక్సైజ్, టీఎస్‌పీఎస్సీ, సింగరేణిలపై సీఎం సుదీర్ఘంగా నిర్వహించిన సమీక్షలో అధికారులకు కీలకమైన సూచనలు చేశారు. నార్కోటిక్ అండ్ డ్రగ్స్‌పై సమీక్ష సందర్భంగా సీఎం మాట్లాడుతూ డ్రగ్స్ దందాపై ఉక్కుపాదం మోపుతామని స్పష్టంచేశారు. రాష్ట్రంలో గ్రే హౌండ్స్, ఆక్టోపస్ విభాగాల్లాగా యాంటీ నార్కొటిక్​బ్యూరోను తీర్చిదిద్దాలని అధికారులకు సూచించారు. ఎవ్వరినీ ఉపేక్షించబోమని; అధికారులు, సిబ్బంది స్వేచ్ఛగా పనిచేయాలని ముఖ్యంత్రి ఈ సందర్భంగా స్పష్టంచేశారు.

నెలనెలా సమీక్ష

డ్రగ్స్ విక్రయించినా, వినియోగించినా ఎవ్వరినీ ఉపేక్షించవద్దని స్పష్టంచేశారు. ఇకపై ప్రతినెలా నార్కోటిక్‌ బ్యూరోపై సమీక్ష సమావేశం నిర్వహిస్తామని వెల్లడించారు. ఆ విభాగానికి పూర్తిస్థాయి డైరక్టర్‌ను నియమించి బలోపేతం చేస్తామన్నారు. అవసరమైన నిధులు, వనరులను సమకూర్చాలని అధికారులను ఆదేశించారు.

ఇది కూడా చదవండి: TSPSC చైర్మన్‌గా జనార్దన్‌ రెడ్డి రాజీనామా!

రేవంత్ రెడ్డిని కలిసిన ఆమ్రపాలి
2010 బ్యాచ్ ఐఏఎస్ ఆమ్రపాలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. ఇటీవల కేంద్ర సర్వీసులో ఆమ్రపాలి డిప్యుటేషన్ పూర్తి కావడంతో తిరిగి రాష్ట్ర సర్వీసులో చేరనున్నారు. సోమవారం ఆమె సీఎం రేవంత్ రెడ్డిని కలిసి రిపోర్ట్ చేశారు. ఆమ్రపాలి గతంలో వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్ గా పనిచేస్తూ డైనమిక్ ఆఫీసర్ గా గుర్తింపు పొందారు. 2020లో ఆమెకు పీఎంవో నుంచి పిలుపు అందడంతో అక్కడికి వెళ్లి డిప్యూటీ కార్యదర్శిగా పనిచేశారు.

#telugu-news #cm-revanth-reddy
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe