/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/revanth-jagan-jpg.webp)
తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇద్దరూ ఒకరికొకరు ట్వీట్లు చేసుకున్నారు. నిన్నటి రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారానికి ఆంధ్ర సీఎం జగన్ రాలేకపోయారు. కానీ రేవంత్ ను అభినందిస్తూ ట్వీట్ చేశారు. ఆయనతో పాటూ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు కూడా శుబాకాంక్షలు తెలిపారు జగన్. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య సోదరభావం, సహకారం ఉండాలని...కలిసి అభివృద్ధి చెందాలని జగన్ ఆకాంక్షించారు.
Also read:ప్రజా భవన్ గా మారిన ప్రగతి భవన్..మరి కాసేపట్లో ప్రజాదర్బార్
వైఎస్ జగన్ ట్వీట్ కు నూతన సీఎం రేవంత్ రెడ్డి కూడా రిప్లై ఇచ్చారు. అభినందనలు తెలిపనందుకు ధన్యవాదాలు చెబుతూ..తమ నూతన ప్రభుత్వానికి ఆంధ్రతో పాటూ అన్ని రాష్ట్రాలు పరస్పర సహకారం అందించాలని రేవంత్ కోరారు. తెలుగు రాష్ట్రాల మధ్య స్నేహభావం పెంపొందాలని కొత్త సీఎం ఆకాంక్షించారు.
శుభాకాంక్షలు తెలిపిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ జగన్ మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు.
సాటి తెలుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ తో పాటు, పొరుగు రాష్ట్రాలతో స్నేహభావం… అభివృద్ధిలో పరస్పర సహకారాన్ని తెలంగాణ ప్రభుత్వం ఆకాంక్షిస్తోంది. https://t.co/UsR4GyPqDR
— Revanth Reddy (@revanth_anumula) December 8, 2023
Also read:గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఆ యాప్స్ తీసేశారు.. ఎందుకంటే..
Follow Us