Congress Press Meet: 24 గంటల కరెంట్ ఇవ్వడం మా గ్యారెంటీ - శ్రీధర్ బాబు

ఆరు గ్యారంటీలపై కేబినెట్ భేటీలో చర్చించామన్నారు మంత్రి శ్రీధర్‌బాబు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ప్రజలకు తెలియాలన్నారు. సోనియా జన్మదినం సందర్భంగా రెండు గ్యారెంటీలు అమలు చేస్తామని శ్రీధర్‌బాబు చెప్పారు. డిసెంబర్ 9 నుంచి ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం అని తెలిపారు.

Congress Press Meet: 24 గంటల కరెంట్ ఇవ్వడం మా గ్యారెంటీ - శ్రీధర్ బాబు
New Update

తెలంగాణ కాంగ్రెస్ మంత్రుల్లో ఒకరైన శ్రీధర్ బాబు  ప్రెస్‌మీట్ నిర్వహిస్తున్నారు. కాసేపటి క్రితమే రాష్ట్ర సచివాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఎల్బీ స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం మంత్రులతో కలిసి సచివాలయానికి చేరుకుని ఆరో అంతస్తులోని తన కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. తన భార్యతో కలిసి, పూజారుల బృందం వేద మంత్రోచ్ఛారణల మధ్య పూజలు నిర్వహించారు.

శ్రీధర్‌ బాబు కామెంట్స్:
--> మార్పు కోరుకునే వారికి ఐదేళ్లలో ఏం చేయగలమో చేపి చూపిస్తాం- శ్రీధర్‌ బాబు

-->ఆరు గ్యారంటీలపై కేబినెట్ భేటీలో చర్చించాం- మంత్రి శ్రీధర్‌బాబు.
-->రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ప్రజలకు తెలియాలి- మంత్రి శ్రీధర్‌బాబు.
-->అన్ని అంశాలను తెలపాలని అధికారులను కోరాం-మంత్రి శ్రీధర్‌బాబు.
-->ఆదాయ వ్యయాలపై శ్వేత పత్రం విడుదలకు నిర్ణయం-మంత్రి శ్రీధర్‌బాబు.
--> ముందుగా రెండు గ్యారెంటీలు అమలు-మంత్రి శ్రీధర్‌బాబు.
--> సోనియా జన్మదినం సందర్భంగా రెండు గ్యారెంటీలో అమలు-మంత్రి శ్రీధర్‌బాబు.

--> 2014 నుంచి డిసెంబర్ 7 2023 వరకు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేత పత్రం రిలీజ్ చేస్తాం.
--> రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై అన్ని వివరాలు ఇవ్వాలని అధికారులను ఆదేశించాము.
--> రేపు(డిసెంబర్ 8) విద్యుత్ శాఖ అధికారులతో సీఎం సమీక్ష చేస్తారు.
--> రైతులకు 24 గంటల కరెంటు పాటు గృహ వినియోగదారులకు 200 యూనిట్ వరకు ఉచిత విద్యుత్ అమలపై చర్చిస్తాం.
--> ఈ నెల 9న తెలంగాణ అసెంబ్లీ సమావేశం.
--> ఎమ్మెల్యేల ప్రమాణస్వీకారంతో పాటు స్పీకర్ ఎన్నిక.
-->  ఎల్లుండి నుంచి ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం.

--> ఆరోగ్యశ్రీ 10 లక్షలకు పెంపు గ్యారంటీని ఎల్లుండి నుంచి అమలు చేస్తాం.
-->  వర్షాలతో నష్టపోయిన రైతులను ఆదుకుంటాం.

Also Read: ముగిసిన రేవంత్‌ తొలి కేబినెట్ భేటీ.. విజువల్స్‌, ఫొటోస్‌..!

#revanth-reddy
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe