Telangana Rythu Bandhu Scheme: తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన ఆరుగ్యారెంటీ పథకాల అమలు కోసం గురువారం నుంచి దరఖాస్తులను స్వీకరించనుంది. 'ప్రజా పాలన' కార్యక్రమంలో ఈ దరఖాస్తులను స్వీకరించనుంది ప్రభుత్వం. మహాలక్ష్మి (Mahalaxmi Scheme), రైతు భరోసా, గృహ జ్యోతి, ఇందిరమ్మ ఇళ్లు, చేయూత పథకాల కోసం ఈ దరఖాస్తులను స్వీకరించనుంది. దరఖాస్తులో రైతుబంధు పథకానికి సంబంధించిన వివరాలను కూడా సేకరిస్తుంది. అయితే, రైతుబంధు అమలుపై సందిగ్ధత కొనసాగుతోంది. ఇంతకాలం ఆటోమాటిక్‌గా రైతుల ఖాతాల్లో పడిన రైతుబంధు నిధులు.. ఇప్పుడు కావాలంటే మళ్లీ దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇదే విషయంపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు.
ప్రస్తుతం రైతు బంధు (Rythu Bandhu) పొందుతున్నప్పటికీ.. మళ్లీ రైతు భరోసా కోసం దరఖాస్తు చేసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) చెప్పారు. ప్రస్తుతానికి భూమి ఎంత ఉన్నా రైతు భరోసా ఇస్తామన్నారు. భవిష్యత్తులో భూమి విస్తీర్ణానికి సీలింగ్ పెట్టే అవకాశం ఉందని తెలిపారు సీఎం. రైతు భరోసా కింద రైతులకు ఏటా ఎకరాకు రూ.15 వేలు ఇస్తామని హామీ ఇచ్చారు.
కాగా, కౌలు రైతులకు సైతం ఈ పథకాన్ని వర్తింపజేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. దీని ప్రకారం.. దరఖాస్తు ఫారంలో మీరు రైతా? లేక కౌలు రైతా? అనేది స్పష్టం చేయాలి. రైతు అయితే భూమికి సంబంధించిన పట్టాదారు పాసు పుస్తకాలు నంబర్లు, సర్వే నెంబర్, ఎంత విస్తీర్ణం భూమి కలిగి ఉన్నారనేది దరఖాస్తులో రాయాలి. కౌలు రైతు అయితే మొత్తం సాగు చేస్తున్నారో దరఖాస్తులో స్పష్టం చేయాలి. సాగు చేస్తున్న భూమి సర్వే నంబర్, పట్టాదారు పుస్తకాల వివరాలు ఇవ్వాలి. ఇదే గ్యారెంటీలో వ్యవసాయ కూలీలకు సైతం ఏటా రూ.12 వేలు ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. ఈ పథకానికి అర్హులుగా ఉండాలంటే.. ఉపాధి హామీ కార్డు నెంబర్ నమోదు చేయాల్సి ఉంటుంది.
Also Read:
వైసీపీ మరో బిగ్ షాక్.. ‘గుడ్ బై’ చెప్పిన ఎమ్మెల్యే..!
ఆ ప్రచారంపై కేటీఆర్‌కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన సీఎం రేవంత్..