Telangana: మందు బాబులకు షాక్.. రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయం..!

తెలంగాణలో మందు బాబులకు షాక్ ఇచ్చేందుకు సిద్ధమైంది రాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్ర వ్యాప్తంగా బెల్ట్ షాపులను మూసివేయాలని భావిస్తోంది. ఎన్నికల హామీల్లో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. బెల్ట్ షాపులను ఎత్తివేయడంతో పాటు.. వైన్ షాపుల సమయాన్ని తగ్గించనుంది.

New Update
Telangana: మందు బాబులకు షాక్.. రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయం..!

Telangana Belt Shops: తెలంగాణలో ముందు బాబులకు షాక్ ఇచ్చేందుకు సిద్ధమైంది రేవంత్ సర్కార్. రాష్ట్ర వ్యాప్తంగా బెల్ట్ షాపులను మూసివేయాలని భావిస్తోంది ప్రభుత్వం. రాష్ట్రంలో బెల్ట్ షాపులను క్లోజ్ చేస్తామని కాంగ్రెస్ పార్టీ తన ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొంది. ఆ హామీ మేరకు రాష్ట్రంలో బెల్ట్ షాపుల మూసివేతకు యాక్షన్ ప్లాన్ షురూ చేశారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ వ్యాప్తంగా 2,620 వైన్ షాప్స్ ఉన్నాయి. ఇక తెలంగాణలో 12,769 గ్రామాలు ఉన్నాయి. ఒక్కో గ్రామంలో అనధికారికగా 2 నుంచి 5 వరకు బెల్ట్ షాపులు నడుస్తున్నాయి. ఈ లెక్కన రాష్ట్రంలో ఎన్ని బెల్ట్ షాపులు ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు.

ఈ బెల్ట్ షాపుల కారణంగా.. రోజంతా కష్టపడి పని చేసిన రైతులు, కూలీలు, పేద ప్రజలు తమ సొమ్మునంతా తాగుడుకే ఖర్చు చేస్తున్నారు. దాంతో పేదల బతుకులు చిద్రమైపోతున్నాయి. అందుకే.. ఎన్నికల్లో ప్రధాన హామీగా రాష్ట్ర వ్యాప్తంగా బెల్ట్ షాపులను ఎత్తివేస్తామని పేర్కొంది కాంగ్రెస్. ఈ హామీ మేరకు బెల్ట్ షాపులపై చర్యలు చేపట్టేందుకు సిద్ధమైంది సర్కార్. అదే సమయంలో వైన్ షాపుల విషయంలోనూ కఠిన నిర్ణయం తీసుకోవాలని భావిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పటి వరకు ఉన్న వైన్ షాపుల టైమ్‌ లిమిట్‌ను కుదించాలని భావిస్తోంది. త్వరలోనే ఈ నిర్ణయాలను అమలు చేసేందుకు సిద్ధమైంది సర్కార్.

Also Read:

ప్రొఫెసర్‌కు గుండెపోటు.. సాయం చేసిన విద్యార్థులపై కేసు నమోదు.. ఎందుకంటే..

అంతరిక్ష కేంద్రంలో టమాటా మాయం.. 8 నెలల తరువాత ప్రత్యక్షం..!

Advertisment
Advertisment
తాజా కథనాలు