CM Revanth: మా పోటీ ఏపీతో కాదు ప్రపంచంతో: సీఎం రేవంత్! ఏపీ, కర్ణాటకతో కాదు తాము ప్రపంచంతో పోటీపడుతామని తెలంగాణ సీఎం రేవంత్ అన్నారు. కాగ్నిజెంట్ కొత్త క్యాంపస్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం.. హైదరాబాద్ పెట్టుబడులకు అనువైన ప్రాంతమన్నారు. తెలంగాణ చుట్టూ ఎక్కడా హైదరాబాద్ లాంటి నగరం లేదని చెప్పారు. By srinivas 14 Aug 2024 in బిజినెస్ తెలంగాణ New Update షేర్ చేయండి Hyderabad: హైదరాబాద్ నగరం పెట్టుబడులకు అనువైన ప్రాంతమని, తెలంగాణ చుట్టూ ఎక్కడా హైదరాబాద్ లాంటి నగరం లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. పారిశ్రామిక వేత్తలు పెట్టబడులు పెట్టడానికి రావాలని, తమకు కావాల్సిన సౌకర్యాలను తెలంగాణ ప్రభుత్వం అందిస్తుందని తెలిపారు. ఈ మేరకు కాగ్నిజెంట్ కొత్త క్యాంపస్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో సీఎం రేవంత్ మాట్లాడుతూ.. 'మా పోటీ ఏపీ, కర్ణాటకతో కాదు.. మా పోటీ ప్రపంచంతో' అన్నారు. త్వరలోనే మరిన్ని ఒప్పందాలు.. అమెరికా, దక్షిణ కొరియా పది రోజుల పర్యటన విజయవంతంగా ముగించడం సంతోషంగా ఉంది. అమెరికా, కొరియాలో మేము కలిసిన ప్రతి ఒక్క వ్యాపారవేత్త, కార్పోరేట్ లీడర్స్ తెలంగాణ, హైదరాబాద్ లో పెట్టుబడులు పెట్టేందుకు సానుకూలంగా ఉన్నారు. ఈ పర్యటన ద్వారా రూ.31,500 కోట్ల పెట్టుబడులు, 30,750కి పైగా ఉద్యోగాలు లభించనున్నాయి. త్వరలోనే మరిన్ని ఒప్పందాలు కుదుర్చుకోనున్నాం. పెట్టుబడులకు సంబంధించి సమావేశాల నిర్వహణ కోసం ఇన్వెస్టర్ టాస్క్ ఫోర్స్‌ను ఏర్పాటు చేస్తాం. ఫ్యూచర్ స్టేట్ తెలంగాణ. రాష్ట్రానికి మూడు రింగ్స్ ఉన్నాయి. మొదటిది కోర్ అర్బన్ ఏరియా హైదరాబాద్. రెండోది సెమీ-అర్బన్ ఏరియా. ఇక్కడ మేము తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయబోతున్నాం. మూడోది రీజనల్ రింగ్ రోడ్ బయట ఉన్న రూరల్ తెలంగాణ. అన్ని రకాల ఆధునిక సౌకర్యాలతో ఆసియాలోనే అత్యుత్తమ గ్రామాలను ఇక్కడ అభివృద్ధి చేస్తాం. వచ్చే 10 ఏళ్లలో తెలంగాణను ఒక ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చాలనేది మా సంకల్పం. కాగ్నిజెంట్ విస్తరణకు పూర్తి మద్దతు ఉంటుందంటూ సీఎం హామీ ఇచ్చారు. కాగ్నిజెంట్‌కు ఎంతో ప్రాధాన్యత ఉంది.. హైదరాబాద్‌లో కాగ్నిజెంట్‌కు ఎంతో ప్రాధాన్యత ఉందని,. హైదరాబాద్ నగరం నాలుగు వందల ఏళ్లకు పైగా చరిత్ర కలిగివుందన్నారు. రాజీవ్ గాంధీ కృషితో హైదరాబాద్ లో ఐటీ అభివృద్ధికి పునాది పడింది. ఆ తరువాత చంద్రబాబు, వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఐటీ అభివృద్ధిని కొనసాగించారు. సైబరాబాద్ సిటీని అభివృద్ధి చేశారు. హైదరాబాద్ లాగే కాగ్నిజెంట్ కూడా అంచెలంచెలుగా అభివృద్ధి చెందింది. రాష్ట్రంలోనే అత్యధిక ఉద్యోగాలు కల్పిస్తున్న రెండో సంస్థగా కాగ్నిజెంట్ గుర్తింపు పొందింది. రాజకీయంగా భిన్నాభిప్రాయాలు ఉన్నా.. హైదరాబాద్ ను అభివృద్ధి చేయడంలో ఎలాంటి భేషజాలు లేవు. హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ లాగే ఫోర్త్ సిటీ.. ఫ్యూచర్ సిటీని అభివృద్ధి చేయబోతున్నామన్నారు. తమ చిత్తశుద్ధి ఏమిటో ఫ్యూచర్ సిటీ అభివృద్దే నిరూపిస్తుందన్నారు ముఖ్యమంత్రి రేవంత్. #cm-revant #hyderabad-business మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి