KCR: కాంగ్రెస్ వస్తే రైతుబంధుకు రాంరాం.. దళితబంధుకు  జై భీమ్: సీఎం కేసీఆర్

కాంగ్రెస్ పార్టీ గెలిస్తే 24 గంటల కరెంట్ పోయి 3 గంటల కరెంట్ వస్తుందని సీఎం కేసీఆర్ అన్నారు. ఈ రోజు జడ్చర్లలో జరిగిన ఎన్నికల సభలో కేసీఆర్ మాట్లాడుతూ.. మరో సారి బీఆర్ఎస్ ను గెలిపించాలని ఓటర్లను కోరారు. కాంగ్రెస్ గెలిస్తే రైతు బంధు, దళితబంధు పథకాలు ఆగిపోతాయన్నారు.

New Update
CM KCR: అప్పుడు ఎట్లుండే తెలంగాణ.. ఇప్పుడు ఎట్లైంది తెలంగాణ.. కేసీఆర్ ఆన్ ఫైర్

బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ (CM KCR) ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. రోజుకు రెండు నియోజవర్గాల్లో నిర్వహించే బహిరంగ సభల్లో పాల్గొంటున్నారు. ఈ రోజు జడ్చర్లలో జరిగిన పబ్లిక్ మీటింగ్ కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ వాళ్లు వస్తే రైతుబంధుకు రాంరాం.. దళితబంధుకు  జై భీమ్ అని అన్నారు. లక్ష్మారెడ్డిని మరో సారి గెలిపించాలని జడ్చర్ల నియోజకవర్గ ఓటర్లను కోరారు కేసీఆర్. ఉద్యమ సమయంలో మహబూబ్ నగర్ జిల్లాలో ఏ మూలకు పోయిన ఏడుపు వచ్చేదన్నారు. నేడు స్వరాష్ట్రంలో ఆ పరిస్థితి మారిందని సంతోషం వ్యక్తం చేశారు. ప్రొ.జయశంకర్ చెప్పినందుకు మహబూబ్ నగర్ నుంచి తాను గతంలో ఎంపీగా పోటీ చేశానన్నారు. నేను మహబూబ్ నగర్ ఎంపీ గా ఉంటూనే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన కీర్తి చిరస్థాయిగా నిలిచి ఉంటుందన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో నడిగడ్డకు వెళ్ళినప్పుడు ఒక ఊర్లో ఏడ్చానని గుర్తు చేసుకున్నారు కేసీఆర్. ఉద్యమంలో పక్కన కృష్ణమ్మ ఉన్నా.. లభమేమి లేకపాయే అనే పాటను తానే రాశానన్నారు.
ఇది కూడా చదవండి: TS BJP First List: 37 మందితో బీజేపీ ఫస్ట్ లిస్ట్ ఇదే.. ఆర్టీవీ ఎక్స్‌క్లూజివ్

పాలమూరు ఎత్తిపోతల సోర్స్ ను శ్రీశైలం నుండి తీసుకుంటున్నామన్నారు. జూరాల నుంచి పాలమూరుకు నీళ్ళు తీసుకోవాలనే దద్దమ్మలకు తెలివి ఉందా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని అనేక మంది ప్రాణాలను బలిగొన్న తర్వాతనే ఇచ్చిందన్నారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు ఇదే జిల్లాకు చెందిన కాంగ్రెస్ నాయకులు కేసులు వేసి అడ్డు పడితే.. 9 సంవత్సరాల పోరాటాల తర్వాత ప్రారంభించామన్నారు. రానున్న 3, 4 నెలల్లో అన్ని రిజర్వాయర్లలో నీళ్లను చూస్తామని హామీ ఇచ్చారు కేసీఆర్. పాలమూరు ప్రాజెక్టు పూర్తి అయితే కరువు అనేది ఈ ప్రాంతాన్ని కన్నెత్తి కూడా చూడదన్నారు.

పోలేపల్లి సెజ్ తెచ్చి అనేక మందికి ఉపాధి అవకాశాలను స్థానిక ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి కల్పించారన్నారు కేసీఆర్. పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసుకున్నామన్నారు. పాలమూరు రంగారెడ్డి 90 శాతం పూర్తి అయ్యింది.. 10 శాతం పనులు ఉన్నాయన్నారు. ఒకప్పుడు దుమ్ము కొట్టుకుని పోయిన దుందుభి నది.. నేడు జీవనదిగా మారిందన్నారు. మరో పదేళ్లు గడిస్తే భారత దేశానికే అన్నం పెట్టే రాష్ట్రంగా తెలంగాణ మారుతుందన్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడు 3 గంటల కరెంట్ చాలు అని కడుపులో ఉన్న మాటను కక్కిండని ధ్వజమెత్తారు. భారతదేశం మొత్తంలో 24 గంటల కరెంట్ ఇచే ఏకైక రాష్ట్రం తెలంగాణ అని అన్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు