గతప్రభుత్వం వాటిని సాధించలేకపోయింది.. ఆ ప్రాజెక్టుకు జాతీయ హోదా కోరాం.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

కేంద్రం నుంచి తెలంగాణకు రావాల్సిన వాటిని గతప్రభుత్వం సాధించలేకపోయిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ఢిల్లీలో ప్రధానితో సీఎం రేవంత్ రెడ్డితో పాటు సమావేశమయ్యారు. విభజన హామీల అమలు, పెండింగ్ నిధుల విడుదలతో పాటు పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని కోరారు.

గతప్రభుత్వం వాటిని సాధించలేకపోయింది.. ఆ ప్రాజెక్టుకు జాతీయ హోదా కోరాం.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
New Update

Bhatti Vikramarka: కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన వాటిని గత ప్రభుత్వం సాధించలేకపోయిందని తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. పదేళ్ల పాటు పాలించిన బీఆర్ఎస్ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను అస్తవ్యస్తం చేసిందని విమర్శించారు. ఢిల్లీలో ప్రధాని మోదీని కలిసిన అనంతరం సీఎం రేవంత్ రెడ్డితో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. విభజన చట్టంలోని అంశాలను ప్రధాని దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు. పెండింగ్ లో ఉన్న నిధులు విడుదల చేయాలని కోరామన్నారు. రాష్ట్రానికి రావాల్సినవన్నీ సకాలంలో అందించాలని ప్రధానిని విజ్ఞప్తి చేసినట్లు  తెలిపారు. సమాఖ్య స్ఫూర్తితో రాష్ట్రానికి అన్నివిధాలా సహకరించాలని కోరినట్లు చెప్పారు.

ఆ ప్రాజెక్టుకు జాతీయ హోదా కోసం విన్నవించాం:
పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలని ప్రధానిని కోరినట్లుగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. అలాగే, పెండింగ్ లో ఉన్న విభజన హామీలను కూడా పరిష్కరించాలని ఆయన దృష్టికి తీసుకెళ్లామన్నారు. బయ్యారంలో ఉక్కు కర్మాగారం, కాజీపేటలో రైల్వేకోచ్ ఫ్యాక్టరీ, ఐటీఐఆర్ ప్రాజెక్టుల అంశాలపై ప్రధానికి నివేదిక సమర్పించామని వెల్లడించారు. తెలంగాణలో ఐఐఎం, సైనిక స్కూళ్ల ఏర్పాటు కోసం విజ్ఞప్తి చేసినట్లు భట్టి విక్రమార్క పేర్కొన్నారు.

ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీతో అరగంట పాటు సమావేశమైన సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క రాష్ట్రంలోని పరిస్థితులను వివరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతపత్రం, అప్పుల వివరాల వంటి అంశాలను ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. ఆర్థిక సంఘం సిఫార్సు మేరకు రాష్ట్రానికి తగినన్ని నిధులు విడుదల చేయాలని, పెండింగ్ లో ఉన్న విభజన హామీల అమలుకు సహకరించాలని కోరడంతో పాటు పలు అంశాలపై ప్రధానికి వారు నివేదిక సమర్పించారు.

ఇది కూడా చదవండి: ప్రధాని అభ్యర్థి ప్రకటన తెచ్చిన లొల్లి.. శరద్‌ పవార్‌ వ్యాఖ్యలతో కూటమిలో తలనొప్పి?

#bhatti-vikramarka #cm-revanth-reddy
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe