Telangana Budget 2024: తాము ఇచ్చిన గ్యారెంటీలకు పెద్దపీట వేస్తూ.. గత ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపుతూ.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఓట్ ఆన్ ఎకౌంట్ బడ్జెట్ ను అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. ఆర్ధిక మంత్రి భట్టి విక్రమార్క రాష్ట్ర బడ్జెట్ ను సమర్పించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టాలనే ఉందనీ.. కానీ, కేంద్ర ప్రభుత్వం ఎన్నికల నేపథ్యంలో ఓట్ ఆన్ ఎకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టడంతో తప్పనిసరి పరిస్థితిల్లో తాము కూడా మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టాల్సి వస్తోందని భట్టి విక్రమార్క చెప్పారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావలసిన నిధులు, కేటాయింపుల విషయంలో స్పష్టత పూర్తి స్థాయి బడ్జెట్ (Telangana Budget 2024)లోనే వస్తుందనీ.. ఆ వివరాలు పూర్తిగా ఉన్నపుడే సరైన కేటాయింపులు చేసుకోగలుగుతామనీ.. అందుకే ప్రస్తుతానికి ఉన్న వనరుల లెక్కలతోనే ఈ మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టామని వివరించారు.
గత ప్రభుత్వ వైఫల్యం..
గత ప్రభుత్వం పదేళ్ల పాటు నిజానికి ఉన్న వనరుల కంటే అధికంగా చూపించి బడ్జెట్ ప్రవేశ పెట్టినపుడు ఏవేవో కేటాయింపులు ప్రకటించేదని భట్టి చెప్పారు. గత సంవత్సరం 2.90 లక్షల కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టారనీ.. అందులో 41,259 కోట్ల రూపాయలు కేంద్రం నుంచి గ్రాంట్ గా వస్తుందని చూపించారనీ వెల్లడించారు. అయితే, వాస్తవానికి 20% కూడా కేంద్రం నుంచి గ్రాంట్స్ రాలేదన్నారు. ఇలాంటి తప్పుడు లెక్కలతో గతంలో బడ్జెట్(Telangana Budget 2024) తీసుకువచ్చేవారంటూ మంత్రి భట్టి విక్రమార్క ఘాటుగా విమర్సించారు.
ఆరు గ్యారెంటీలకు ప్రాధాన్యం..
తాము అధికారంలోకి రావడానికి ఆరు గ్యారెంటీలను ప్రజలు నమ్మడమే అని భట్టి విక్రమార్క అన్నారు. ప్రజల ఆ నమ్మకాన్ని వమ్ము చేయమని చెప్పిన ఆయన ఆరు గ్యారెంటీల కోసం ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తున్నామని చెప్పారు. ఆరు గ్యారెంటీల అమలు కోసం మొత్తం రూ.53,196 కోట్లు కేటాయించినట్టు ప్రకటించారు. ఈ సందర్భంగా మహాలక్ష్మి పథకం కోసం 92,23,195 అప్లికేషన్లు వచ్చాయని చెప్పారు. వీటిని పరిశీలించి అర్హులైన వారిని గుర్తించి.. అర్హులైన అందరికీ పథకాన్ని (Telangana Budget 2024)అందిస్తామని స్పష్టం చేశారు.
ఎంతటి కష్టాన్నైనా ఎదుర్కొంటాం..
తెలంగాణ ప్రజల జీవితాల్లో గుణాత్మకమైన మార్పు తీసుకురావాలనేదే తమ ధ్యేయం(Telangana Budget 2024) అని చెప్పిన మంత్రి భట్టి విక్రమార్క ప్రజల సంక్షేమం కోసం ఎలాంటి ఇబ్బందులు వచ్చినా ఎదుర్కొంటామని అన్నారు. మరింత పటిష్టంగా ప్రభుత్వ పరిపాలన కొనసాగుతుందాంటూనే సమానత్వమే మా ప్రభుత్వ విధానం అని ప్రకటించారు. గత ప్రభుత్వంలో దళిత బంధు పథకం కోసం రూ.17700 కోట్లు బడ్జెట్లో చూపించారు. కానీ, వాస్తవానికి ఒక్కరూపాయి కూడా అందుకోసం ఖర్చు చేయలేదు అని చెప్పిన భట్టి విక్రమార్క తాము బడ్జెట్లో ప్రవేశపెడుతున్న ప్రతి పథకానికి సంబంధించిన వాస్తవ లెక్కలే చెబుతామనీ.. అందుకోసం అన్ని లెక్కలు సరిచూసుకుంటున్నామనీ చెప్పారు.
Also Read: ఇంటి రెంటల్ ఎగ్రిమెంట్ 11 నెలలకే ఎందుకు చేస్తారు?
తెలంగాణ ఓట్ ఆన్ ఎకౌంట్ బడ్జెట్ హైలైట్స్..
- 2024-25 ఆర్థిక సంవత్సరానికి ఓట్ ఆన్ ఎకౌంట్(Telangana Budget 2024) మొత్తం వ్యయం రూ. 2,75,891 కోట్లు. రెవెన్యూ వ్యయం రూ.2,01,178 కోట్లు. మూలధన వ్యయం రూ.29,669 కోట్లు.
- 2022-23తో పోలిస్తే జీఎస్టీపీ రూ.13,02,371 కోట్ల నుంచి రూ.14,49,708 కోట్లకు పెరిగింది. ఇంకా, ఆర్థిక వృద్ధి 14.7 శాతం నుంచి 11.3 శాతానికి తగ్గింది.
- దేశీయంగా వృద్ధి రేటు 16.1 శాతం నుంచి 8.9 శాతానికి పడిపోయింది. అదే సమయంలో అధిక ద్రవ్యోల్బణంతో తెలంగాణ దేశంలో ఐదో స్థానంలో ఉంది.
తెలంగాణ ఓట్ ఆన్ ఎకౌంట్ బడ్జెట్ లో కేటాయింపులు ఇలా..
- Telangana Budget 2024: ఆరు హామీల అమలుకు 53,196 కోట్లు.
- ఐటీ శాఖకు 774 కోట్లు.
- పంచాయతీరాజ్ శాఖకు 40080 కోట్లు.
- మున్సిపల్ శాఖకు రూ.11,692 కోట్లు.
- వ్యవసాయ శాఖకు 19,746 కోట్లు.
- ఎస్సీ, ఎస్టీ గురుకుల భవనాలకు 1250 కోట్లు.
- గృహ నిర్మాణానికి 7740 కోట్లు.
- నీటిపారుదల శాఖకు 28024 కోట్లు.
- బీసీల సంక్షేమం కోసం ఎనిమిది వేలకోట్ల రూపాయలు.
- విద్యుత్-గృహ జ్యోతి పథకానికి 2,418 కోట్లు.
- విద్యుత్ సంస్థలకు 16825 కోట్లు.
- రాజీవ్ ఆరోగ్యశ్రీ కవరేజీని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచాం.
- విద్యుత్ రంగానికి రూ.16,825 కోట్లు కేటాయింపు
- మహాలక్ష్మి పథకం కింద ఆర్టీసీకి నెలకు రూ.300 కోట్లు అదనంగా కేటాయింపు.
- గృహజ్యోతి కింద రూ.500కే వంటగ్యాస్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్
- విద్యా రంగానికి 21,389 కోట్లు.
- తెలంగాణలో ప్రభుత్వ పాఠశాలల ఏర్పాటుకు(Telangana Budget 2024) 500 కోట్లు.
- యూనివర్సిటీల్లో సౌకర్యాల కోసం 500 కోట్లు.
- ఎస్సీ సంక్షేమం రూ.21,874 కోట్లు.
- ఎస్టీ సంక్షేమం రూ.13,013 కోట్లు.
- పరిశ్రమల శాఖకు రూ.2,543 కోట్లు ప్రతిపాదిస్తాం.
- డిసెంబర్ 9 నుంచి మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించాం.
- 35,781 అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా గర్భిణులకు పౌష్టికాహారం.
- తెలంగాణను ఎడ్యుకేషన్ హబ్‌గా మారుస్తాం.
- విద్యా రంగానికి 21389 కోట్లు.
- త్వరలో అంతర్జాతీయ ప్రమాణాలతో తెలంగాణ ప్రభుత్వ పాఠశాలలు రానున్నాయి.
- తెలంగాణ ప్రభుత్వ పాఠశాలలకు రూ.500 కోట్లు కేటాయింపు.
- ప్రైవేట్ సంస్థల సహకారంతో 65 ఐఐటీల ఏర్పాటు.
- గుజరాత్, ఢిల్లీ, ఒడిశా తరహాలో స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు.
- రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీలకు 500 కోట్లు.
- మా ప్రభుత్వంలో 6,956 మంది నర్సులను నియమించాం.
- వైద్య రంగానికి రూ.11,500 కేటాయింపు.
- యువత సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం.
- యువకులను రెచ్చగొట్టకుండా... ఆత్మగౌరవంతో బతికేలా చేస్తాం.
- పని క్యాలెండర్‌ను సిద్ధం చేసే ప్రక్రియను ప్రారంభించాము.
- త్వరలో మెగా డీఎస్సీ
- త్వరలో 15,000 మంది ఏజెంట్ల నియామకం.
- తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ను ప్రక్షాళన
- TSPSC కోసం 40 కోట్ల ఆర్థిక వనరులు.
Watch this Interesting Video: