KTR: పరీక్షల వాయిదాతో రూ.400 కోట్లు.. అందులో రేవంత్ వాటా ఎంత?

పరీక్షలు వాయిదా వేస్తే కోచింగ్ సెంటర్లకు వందల కోట్లు లాభం వస్తుందని సీఎం రేవంత్ రెడ్డి గతంలో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారని కేటీఆర్ గుర్తు చేశారు. ఇప్పుడు గ్రూప్-2 ను నాలుగు నెలలు వాయిదా వేశారని.. దీంతో రూ.400 కోట్లు వస్తున్నాయా? అందులో సీఎం వాటా ఎంత? అని ప్రశ్నించారు.

New Update
KTR: పరీక్షల వాయిదాతో రూ.400 కోట్లు.. అందులో రేవంత్ వాటా ఎంత?

పార్టీ ఫిరాయింపులు, నిరుద్యోగులకు కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నెరవేర్చని అంశంలో గవర్నర్ రాధాకృష్ణన్ ను ఈ రోజు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర నాయకులు కలిసి ఫిర్యాదు చేశారు. అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలో రాజ్యాంగంపై జరుగుతున్న దాడి, ఇతర అంశాలను గవర్నర్ రాధాకృష్ణన్ దృష్టికి తీసుకెళ్లామన్నారు. మా పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందుబాటులో ఉన్న నాయకులంతా గవర్నర్ ను కలిశామన్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగ యువత, విద్యార్థులకు ఇచ్చిన హామీలను ఎలా తుంగలో తొక్కుతున్నదో వివరించామన్నారు. హామీలు అమలు చేయాలన్న విద్యార్థుల మీద నిర్భంధం, అణిచివేత, అరెస్ట్ లు, అక్రమ కేసులతో భయానక వాతావారణం పునరావృతం చేస్తున్నారని చెప్పామన్నారు. సిటీ సెంట్రల్ లైబ్రరీలో లాఠీ ఛార్జ్, ఓయూ విద్యార్థులపై దాడి చేస్తూ ఉద్యమ నాటి అణిచి వేత వైఖరిని కాంగ్రెస్ ప్రభుత్వం మళ్లీ ప్రయోగిస్తుందని ఆయన దృష్టికి తెచ్చామన్నారు.

రూ. 2 లక్షల ఉద్యోగాలు, జాబ్ క్యాలెండర్ కు సంబంధించి కాంగ్రెస్ ఇచ్చిన ప్రకటనలు, హామీలను గవర్నర్ కు తెలిపామన్నారు. గ్రూప్ 1, 2, 3 కి సంబంధించి పోస్టులు పెంచుతామని...ఆ హామీ పట్టించుకోవటం లేదన్నది వివరించామన్నారు. గవర్నర్ ఈ అంశాలపై చాలా సీరియస్ గా స్పందించారని కేటీఆర్ చెప్పారు. హోంశాఖ కార్యదర్శిని పిలిచి వివరాలు అడుగుతానని చెప్పారన్నారు. రాష్ట్రంలో ఏ విధంగా రాజ్యాంగ హననం జరుగుతుందో కూడా గవర్నర్ కు చెప్పామన్నారు. తమ పార్టీ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను బయపెట్టి కాంగ్రెస్ లో చేర్చుకుంటున్నారని ఫిర్యాదు చేశామన్నారు.

కాంగ్రెస్ చేస్తున్న రాజ్యాంగ విరుద్దమైన పనులకు సంబంధించిన గవర్నర్ కు మాత్రమే కాదు. రాష్ట్రపతికి కూడా ఫిర్యాదు చేస్తామన్నారు. రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు బీఆర్ఎస్ పార్టీగా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. వారికి కాంగ్రెస్ ఇచ్చిన అన్ని హామీలు నెరవేర్చే వరకు పోరాటం చేస్తుందన్నారు. ఇక మేడిగడ్డ కొట్టుకుపోయిందని, కాళేశ్వరంలో లక్ష కోట్లు గంగపాలు అయ్యిందంటూ చిల్లర ప్రచారం చేసిన కాంగ్రెస్ ఇప్పుడు సిగ్గుతో తలదించుకోవాలన్నారు.

అక్కడ జరిగిన చిన్న విషయంపై తప్పుడు ప్రచారం చేశారని ధ్వజమెత్తారు. కొన్ని రోజుల్లోనే రిపేర్లు పూర్తి అయ్యాయన్నారు. ఇప్పుడు వరదలాగా నీళ్లు వస్తున్నా.. మేడిగడ్డ తట్టుకోవటమంటే అదే కాళేశ్వరం గొప్పతనమన్నారు. త్వరలోనే మేడిగడ్డను సందర్శించి ప్రజలకు వాస్తవాలను వివరిస్తామన్నారు. పరీక్షలు వాయిదా వేస్తే కోచింగ్ సెంటర్లకు వందల కోట్ల లాభం వస్తుందని సీఎం అన్నారని గుర్తు చేశారు కేటీఆర్. అయితే.. ఇప్పుడు గ్రూప్-2 ను నాలుగు నెలలు వాయిదా వేశారని.. దీంతో 4 వందల కోట్లు వస్తున్నాయా? అని ప్రశ్నించారు. అందులో సీఎం వాటా ఎంత? అని విమర్శలు గుప్పించారు.

Also Read : పవన్‌కు మావోయిస్టుల ముప్పు!



Advertisment
Advertisment
తాజా కథనాలు