బీజేపీ మరో ట్విస్ట్ ఇచ్చింది. ఇప్పటికే ఫైనల్ లిస్ట్ రిలీజ్ చేసి ఇద్దరు అభ్యర్థులను మార్చగా.. ఇప్పుడు మరో రెండు స్థానాలకు అభ్యర్థుల పేర్లు మార్చింది. వేములవాడ, సంగారెడ్డి స్థానాల్లో అభ్యర్థులను మార్పు చేసింది. వేములవాడలో తుల ఉమా స్థానంలో వికాస్ రావుకు అవకాశం ఇచ్చంది. అలాగే సంగారెడ్డి అభ్యర్థిగా పులి మామిడి రాజును ఖరారు చేసింది. మరోవైపు బెల్లంపల్లి నియోజకవర్గ బీజేపీ అభ్యర్థిగా అమరజుల శ్రీదేవి కొనసాగుతారాని పార్టీ ప్రకటన విడుదల చేసింది. ఫస్ట్ లిస్ట్ లో శ్రీదేవి పేరును ప్రకటించగా.. ఈ రోజు ఉదయం ఆమె స్థానంలో హేమాజీ పేరును ప్రకటించారు. అలాగే అలంపూర్ అభ్యర్థిగా మారెమ్మ స్థానంలో అభ్యర్థిగా రాజగోపాల్ ను ప్రకటించింది.
Also read: అద్దంకిని కాదని సామేలుకు తుంగతుర్తి టికెట్.. ఆయన బ్యాక్ గ్రౌండ్ ఎంటో తెలుసా?
అయితే ఉదయం ఫైనల్ లిస్ట్ విడుదల చేసిన తర్వాత మళ్లీ మళ్లీ అభ్యర్థులను మార్చడానికి కారణం ఏంటనే అంశంపై బీజేపీ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. హైకమాండ్ కు రాష్ట్ర నాయకత్వానికి మధ్య సమన్వయ లోపం ఉందా? అన్న అనుమానాలు సైతం వ్యక్తం అవుతున్నాయి. ఇదిలా ఉండగా.. తెలంగాణలో ఈ రోజు నామినేషన్ల ప్రక్రియ ముగియనుంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ నిన్న రాత్రి మిగిలిన 4 స్థానాలకు అభ్యర్థుల లిస్ట్ ను విడుదల చేసింది.
Also read: భగ్గుమంటోన్న నీలం మధు.. నేడు ఇండిపెండెంట్ గా నామినేషన్!