Telangana BJP: సీఎం రేవంత్‌ను చిక్కుల్లో పెట్టేందుకు బీజేపీ కీలక నిర్ణయం

TG: ఈ నెల 24 నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈరోజు టీబీజేపీ భేటీ అయింది. ఈ భేటీలో కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఎమ్మెల్యేలు, ఎంపీలు పాల్గొన్నారు. అసెంబ్లీలో రేవంత్ సర్కార్‌ను ఇరుకున పెట్టేందుకు అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు.

Telangana BJP: సీఎం రేవంత్‌ను చిక్కుల్లో పెట్టేందుకు బీజేపీ కీలక నిర్ణయం
New Update

Telangana BJP: తెలంగాణపై కేంద్ర బీజేపీ స్పెషల్‌ ఫోకస్ పెట్టింది. ఎంపీ ఎన్నికల ఫలితాలతో జోష్ మీదున్న బీజేపీ రేవంత్‌ను ఇరుకున పెట్టేలా కమలం నేతల వ్యూహాలు రచిస్తున్నారు. ఓవైపు బీజేపీ రాష్ట్ర విస్తృతస్థాయి కార్యవర్గ సమావేశం.. మరోవైపు అసెంబ్లీ ఎల్పీలో బీజేఎల్పీ సమావేశం జరుగుతోంది. బీజేపీ విస్తృత స్థాయి సమావేశానికి ముఖ్య అతిథిగా ధర్మేంద్ర ప్రధాన్ హాజరయ్యారు. తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, బండి సంజయ్, ఎంపీలు, ఎమ్మెల్యేలు సమావేశంలో పాల్గొన్నారు. 6 గ్యారంటీలు, నిరుద్యోగ సమస్యలు, రుణమాఫీ, రైతుభరోసాపై నిలదీయాలని నిర్ణయం తీసుకున్నారు. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో BJLP భేటీ అయింది.

తెలంగాణ ప్రజలకు సెల్యూట్: కిషన్ రెడ్డి

కాంగ్రెస్‌ ప్రభుత్వం తక్కువ కాలంలోనే ప్రజల విశ్వాసం కోల్పోయిందని అన్నారు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి. ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించిన కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. బీజేపీకి ఓట్లు, సీట్లు ఇచ్చిన తెలంగాణ ప్రజలకు సెల్యూట్ చేశారు. కేసీఆర్‌ నియంతృత్వ, నిరంకుశ పాలనపై సుదీర్ఘ పోరాటం చేశామన్నారు. సీఎం ప్రాతినిధ్యం వహించిన మల్కాజ్‌గిరిపై కాషాయ జెండా ఎగిరిందని చెప్పారు.

సీఎం సొంత జిల్లాలో కూడా బీజేపీ జెండా ఎగిరిందని అన్నారు. తెలంగాణలో బీజేపీకి ఓటు బ్యాంకు 14 నుంచి 35 శాతానికి పెరిగిందని చెప్పా. పదేళ్లు పాలించిన బీఆర్ఎస్ ఒక్క ఎంపీ సీటు గెలవలేక ప్రజా ఆగ్రహానికి గురైందని విమర్శించారు.

#telangana-bjp
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe